Unique Coin: వేలంలో బిలియన్లకు అమ్ముడుపోయిన 15 వందల నాణెం.. ప్రపంచంలోనే విలువైనదిగా రికార్డ్

అరుదైన నాణెం బిలియన్లు పలుకుతోంది. ఈ అరుదైన నాణెం విలువ మార్కెట్ లో వేలల్లో ఉంటే.. వేలం వేసినప్పుడు దీని విలువ చాలా ఎక్కువగా ఉంది. దీంతో ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నాణెం అయింది.

Unique Coin: వేలంలో బిలియన్లకు అమ్ముడుపోయిన 15 వందల నాణెం.. ప్రపంచంలోనే విలువైనదిగా రికార్డ్
Us Lady Unique Coin
Follow us

|

Updated on: May 26, 2022 | 3:38 PM

Unique Coin: లొకో భిన్నరుచిః అన్నారు పెద్దలు. కొంతమందికి భిన్నమైన అలవాట్లు ఉంటాయి. రకరకాల పాత వస్తువులను సేకరించడం హాబీగా ఉన్నవారు ఎందరో ఉన్నారు. చాలా మంది పాత స్టాంపులను సేకరిస్తే, పాత నాణేలను సేకరించడానికి చాలా మంది ఇష్టపడతారు. అయితే ఇలాంటి హాబీలు వారికీ తెలియకుండానే వారిని లక్షాధికారులను చేస్తాయి. ఈరోజు అరుదైన నాణెం బిలియన్లు పలుకుతోంది. ఈ అరుదైన నాణెం విలువ మార్కెట్ లో వేలల్లో ఉంటే.. వేలం వేసినప్పుడు దీని విలువ చాలా ఎక్కువగా ఉంది. దీంతో ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నాణెం అయింది.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నాణెం డబుల్ ఈగిల్ గోల్డ్ కాయిన్.  దీని మార్కెట్ విలువ వేలల్లో ఉంది. అయితే దీనిని  వేలానికి ఉంచినప్పుడు ప్రజలు దానిని కొనడానికి బిలియన్ల రూపాయలు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది  1933లో తయారు చేయబడిన ఒక అమెరికన్ నాణెం.

 ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నాణెం:  ఈ నాణేన్ని వేలానికి మార్కెట్‌లోకి తీసుకువచ్చినప్పుడు రూ. 1,44,17, 95, 950 లకు అమ్ముడయ్యింది. అయితే మార్కెట్ ధర ప్రకారం ధర దాదాపు పదహారు వందలు విలువైన నాణెం ఎందుకు ఇంత ఖరీదైనది అంటే.. వాస్తవానికి, ఈ నాణెం ఒక వైపున లేడీ లిబర్టీ ఆఫ్ అమెరికా చిత్రాన్ని కలిగి ఉంది. మరోవైపు అమెరికన్ ఈగిల్  ముద్రించబడింది.

ఇవి కూడా చదవండి

ఈ నాణెం గురించి అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ నాణెం  తయారు చేయబడింది, కానీ ఇది ఎప్పుడూ వినియోగంలోకి రాలేదు. ఇది అమలులోకి వచ్చే సమయానికి, అమెరికాలో బంగారు నాణేల తయారీని నిలిపివేశారు. దీంతో ఇటువంటి బంగారు నాణాలను తయారు చేయడం నిలిపివేశారు. అంతేకాదు అప్పటికే తయారు చేసిన నాణేలను  నాశనం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ నాణెం మనుగడలో ఉంది. ఇప్పుడు దీని విలువ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నాణెంగా మారింది.

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..