Rahul Gandhi: రాహుల్ గాంధీ బ్రిటన్ పర్యటనపై వివాదం.. ఆ క్లియరెన్స్‌ తీసుకోవడం తప్పనిసరా..?

విదేశీ పర్యటన చేసే క్రమంలో ప్రతి పార్లమెంట్‌ సభ్యుడు తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి క్లియరెన్స్‌ తీసుకోవాల్సి ఉన్నప్పటికీ.. రాహుల్‌ గాంధీ మాత్రం తీసుకోలేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

Rahul Gandhi: రాహుల్ గాంధీ బ్రిటన్ పర్యటనపై వివాదం.. ఆ క్లియరెన్స్‌ తీసుకోవడం తప్పనిసరా..?
Rahul Gandhi
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 26, 2022 | 7:37 AM

Rahul Gandhi – Govt Clearance: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బ్రిటన్‌ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. లండన్‌లో ఉన్న రాహుల్‌ పలు ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొంటూ.. బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. దీంతో బీజీపీ నేతలు కూడా రాహుల్‌ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ క్రమంలో రాహుల్‌ పర్యటనపై ఒక్కసారిగా వివాదం రేగింది. లండన్‌కు బయలుదేరే ముందు రాహుల్ గాంధీ భారత ప్రభుత్వం నుంచి పొలిటికల్‌ క్లియరెన్స్‌ తీసుకోలేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. విదేశీ పర్యటన చేసే క్రమంలో ప్రతి పార్లమెంట్‌ సభ్యుడు తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి క్లియరెన్స్‌ తీసుకోవాల్సి ఉన్నప్పటికీ.. రాహుల్‌ గాంధీ మాత్రం తీసుకోలేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై స్పందించిన కాంగ్రెస్‌.. ప్రైవేటు కార్యక్రమాలకు పొలిటికల్‌ క్లియరెన్స్‌ అవసరం లేదంటూ.. బీజేపీ వ్యాఖ్యలను తిప్పికొడుతుంది.

పార్లమెంట్‌ సభ్యులు విదేశీ పర్యటన చేసే సమయంలో భారత విదేశీ వ్యవహారాలశాఖ నుంచి పొలిటికల్‌ క్లియరెన్స్‌ తీసుకోవాల్సి ఉంటుంది. విదేశాల నుంచి ఎంపీలకు వచ్చే ఆహ్వానం కూడా భారత విదేశాంగశాఖ ద్వారానే రావాలి. విదేశీ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకునే ఎంపీలు అందుకు సంబంధించిన వివరాలతో మూడు వారాల ముందే విదేశాంగశాఖ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోని.. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి ఆమోదం పొందాల్సి ఉంటుంది. కానీ, రాహుల్‌ గాంధీ మాత్రం అలా చేయలేదని.. అని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. కొన్ని సందర్భాల్లో ఆహ్వానం నేరుగా అందితే.. ఆ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వశాఖకు తెలియజేసి పొలిటికల్‌ క్లియరెన్స్‌ పొందాల్సి ఉంటుందని చెబుతున్నాయి.

విదేశాల్లో ఉన్న రాహుల్‌ గాంధీ పొలిటికల్‌ క్లియరెన్స్‌ తీసుకోలేదని వచ్చిన కథనాలపై కాంగ్రెస్‌ విమర్శించింది. అధికారిక బృందం అయితే.. తప్ప ప్రధాని నుంచి గానీ, ప్రభుత్వం నుంచి గానీ ఎంపీలు పొలిటికల్‌ క్లియరెన్స్‌ తీసుకోవాల్సిన అవసరం లేదని.. టీవీ ఛానళ్లకు అందిన వాట్సాప్‌ మెసేజ్‌లను గుడ్డిగా నమ్మెద్దంటూ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా సూచించారు.

ఇవి కూడా చదవండి

ఇదిలాఉంటే బ్రిటన్‌ పర్యటనలో ఉన్న రాహుల్‌ గాంధీ పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతోపాటు భాజపాపైనా విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో విదేశీ గడ్డపై భారత్‌ పరువు తీస్తున్నారని రాహుల్‌ గాంధీపై భాజపా నేతలు విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే పొలిటికల్‌ క్లియరెన్స్‌ అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.

ఇదిలాఉంటే.. బ్రిటన్‌ పర్యటనలో ఉన్న రాహుల్‌ గాంధీ పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని కార్పస్ క్రిస్టీ కాలేజీలో ‘ఇండియా ఎట్ 75’ పేరుతో జరిగిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడూత.. ప్రశ్నించే వారిపై దాడి జరుగుతోందని ఆరోపించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..