Viral: మాకూ ఫీలింగ్స్ ఉంటాయ్ సర్..! దొంగతనం చేసి ప్రేమగా ఐ లవ్ యూ చెప్పారు.. ట్విస్ట్ అంటే ఇదే..
గోవాలో సినిమాటిక్‌గా అసాధరణ రీతిలో జరిగిన చోరీ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Goa theft: దేశంలో నిత్యం దొంగతనాలు జరుగుతుంటాయి.. అయితే.. దొచుకున్న దొంగలు అక్కడి నుంచి ఉడయించడం పరిపాటి.. అయితే.. ఓ దొంగ స్టైల్ మార్చాడు.. భారీగా దొంగతనం చేసి.. ఐ లవ్ యూ చెప్పాడు.. అదేంటి అర్ధం కాలేదా.? అయితే.. గోవాలో సినిమాటిక్‌గా అసాధరణ రీతిలో జరిగిన చోరీ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన సౌత్ గోవాలోని మార్గోవ్ పట్టణంలో జరిగినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తలుపులు పగలగొట్టి లోపలికి చొరబడిన దుండగులు రూ.20లక్షల విలువ చేసే ఆభరణాలతో పాటు నగదును ఎత్తుకెళ్లారు. అంతేకాకుండా ఆ ఇంట్లో ఐ లవ్ యూ అనే సందేశాన్ని రాసిపెట్టి దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆసిబ్ జెక్ అనే వ్యక్తి రెండు రోజుల కోసం బయటకు వెళ్లి మంగళవారం తిరిగి వచ్చాడు. ఇంటికి వచ్చే సరికి తలుపులు తీసి ఉన్నాయి. మొత్తం పరిశీలించగా.. రూ.20లక్షల విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలు, రూ.1.5లక్షల నగదు చోరీకి గురైనట్టు గుర్తించాడు. అంతేకాకుండా ఇంట్లో టీవీ స్క్రీన్‌పై ‘ఐ లవ్ యూ’ అని మార్కర్‌తో రాసి ఉండటాన్ని గమనించాడు. ఇది చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు.
వెంటనే మార్గోవ్ పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేశాడు. వారొచ్చి పరిశీలించి కేసు నమోదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్‌స్పెక్టర్ సచిన్ నర్వేకర్ బుధవారం మీడియాకు తెలిపారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..