Viral: ఈ ఫోటోలో ఉన్నది ఏంటో తెలుసా?.. ఇది ‘దోశ’ అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే..!

Viral: ఇంటర్నెట్‌లో తరచుగా కనిపించే కొన్ని పోటోలు, వీడియోలు.. ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తాయి. గతంలో ఎప్పుడో షేర్ చేసినప్పటికీ..

Viral: ఈ ఫోటోలో ఉన్నది ఏంటో తెలుసా?.. ఇది ‘దోశ’ అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే..!
Jupiter
Follow us
Shiva Prajapati

| Edited By: Ravi Kiran

Updated on: May 26, 2022 | 7:18 AM

Viral: ఇంటర్నెట్‌లో తరచుగా కనిపించే కొన్ని పోటోలు, వీడియోలు.. ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తాయి. గతంలో ఎప్పుడో షేర్ చేసినప్పటికీ.. కాలంతో సంబంధం లేకుండా మళ్లీ మళ్లీ వైరల్ అవుతుంటాయి. తాజాగా ‘దోశ’ ఆకారం లా ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఎందుకంటే.. అది చూడటానికి ‘దోశ’ లా ఉన్నప్పటికీ.. దాని వెనుక పెద్ద విశేషమే ఉంది. విశ్వానికి సంబంధించిన మ్యాటర్ ఆ ఫోటోలో ఉంది. అవును.. అది ‘దోశ’ ఎంతమాత్రం కాదండోయ్. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) కొన్ని సంవత్సరాల క్రితం ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన బృహస్పతి మ్యాప్ అది. చూడటానికి దోశ మాదిరిగా ఉన్న ఆ ఫోటో.. వాస్తవానికి బృహస్పత్రి గ్రహానికి సంబంధించింది. ఈ ఫోటో మళ్లీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

లేటెస్ట్ ఇన్ స్పేస్ అనే ట్విట్టర్ హ్యాండిల్‌లో ఈ ఫోటో పోస్ట్ చేశారు.. “బృహస్పతి కింద నుంచి పైకి చూస్తే ఇలా ఉంది.’’ అని క్యాప్షన్ పెట్టారు. ఈ పిక్చర్‌ను నాసా కాసిన్ క్యాప్చర్ చేసింది. కాసిన్ స్పేస్‌క్రాఫ్ట్‌లోని నారో యాంగిల్ కెమెరా నుంచి తీసిన చిత్రాలను స్పేస్ ఏజెన్సీ నాసా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోను ఇటీవల సోషల్ మీడియాలో మళ్లీ షేర్ చేయగా.. దాదాపు 20వేలకు పైగా లైక్స్ వచ్చాయి. అలాగే ఈ ఫోటోను విపరీతంగా షేర్ చేస్తున్నారు నెటిజన్లు. ఆ ఫోటోను చూసి ఇది నిజంగా మసాలా ‘దోశ’ మాదిరిగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి