Viral Video: సరిహద్దులో చిన్న పిల్లల్లా మారిపోయిన జవాన్లు.. వీడియో చూస్త వావ్ అనాల్సిందే..

Viral Video: సరహిద్దుల్లో భద్రతా సిబ్బంది ఎంత అలర్ట్‌గా ఉంటారో మనందరికీ తెలిసిందే. పొరుగు దేశాల నుంచి పొంచి ఉన్న శత్రువులను కాపుకాస్తూ..

Viral Video: సరిహద్దులో చిన్న పిల్లల్లా మారిపోయిన జవాన్లు.. వీడియో చూస్త వావ్ అనాల్సిందే..
Jawans
Follow us
Shiva Prajapati

|

Updated on: May 25, 2022 | 5:09 PM

Viral Video: సరహిద్దుల్లో భద్రతా సిబ్బంది ఎంత అలర్ట్‌గా ఉంటారో మనందరికీ తెలిసిందే. పొరుగు దేశాల నుంచి పొంచి ఉన్న శత్రువులను కాపుకాస్తూ.. దేశానికి, దేశ ప్రజలకు ఏం కాకుండా అడ్డుగోడవలే సరిహద్దులు విధులు నిర్వహిస్తుంటారు జవాన్లు. పగలు, రేయి, ఎండా, వానా, చలి అనే బేధమేమీ వారికి తెలియదు. వారికి తెలిసిందల్లా దేశ రక్షణ మాత్రమే. అయితే, నిత్యం రక్షణ బాధ్యతలతో బిజీగా ఉండే సైనికులు.. సమయం ఉన్నప్పుడు కాస్త రిలీఫ్ అవుతుంటారు. తోటి జవాన్లతో సరదాగా గేమ్స్ ఆడటం, పాటలు పాడటం, డ్యాన్స్ చేయడం వంటివి చేస్తుంటారు. అయితే, తాజాగా ఐటీబీపీ(ITBP) అధికారిక ట్విట్టర్‌లో ఓ వీడియో షేర్ చేశారు. ఆ వీడియోకు భారతీయులందరూ ఫిదా అయిపోతున్నారు. సలామ్ జవాన్ అంటూ సెల్యూట్ చేస్తున్నారు నెటిజన్లు.

ఇండో-టిబెటన్ బోర్డర్ భద్రతా సిబ్బంది చిన్నపిల్లల్లా మారిపోయారు. మంచు దిబ్బల్లో సరదాగా కాసేపు ఆడుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను మరొక్కసారి గుర్తు చేసుకుని సంతోషంగా గడిపారు. చుట్టూ మంచు దిబ్బలు.. ఆ మంచులోనే విధులు నిర్వహిస్తున్నారు ఐటీబీపీ జవాన్లు. కాసేపు సమయం దొరకడంతో జవాన్లు సరదాగా చిన్నతనంలో ఆడుకునే కోకో లాంటి ఆటలు ఆడారు. హిమాచల్ ప్రదేశ్‌లోని సరిహద్దుల్లో హిమాలయ పర్వతాల మంచులో చలి తీవ్రత తట్టుకునేందుకు వీలుగా తెల్లని దుస్తులు ధరించిన జవాన్లు.. రౌండ్‌గా కూర్చున్నారు. వీరిలో ఒకరు రౌండ్‌గా కూర్చున్న వారి వెనుక పరుగెడుతూ.. ఎవరో ఒకరి వద్ద తన చేతిలోని వస్తువును వదిలేస్తున్నారు. అలా ఏ వ్యక్తి వద్ద అయితే వదిలేస్తారో.. ఆ వ్యక్తి దానిని తీసుకుని, సదరు వ్యక్తి పట్టుకోవాలి. ఈ గేమ్‌ను జవాన్లు చాలా ఉత్సాహంగా ఆడారు. జవాన్ల సరదా ఆటకు సంబంధించిన వీడియోను ఐటీబీపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు అధికారులు. దాంతో ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. జవాన్ల ఆటకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. సైనికులకు సెల్యూట్ చేస్తున్నారు. కాగా, ఈ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా కూడా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ‘మీలో ఉన్న పిల్లవాడిని ఎప్పటికీ చనిపోనివ్వకండి. ఇది ఎలాంటి పరిస్థితుల్లో అయినా సంతోషంగా ఉండటానికి కారణం అవుతుంది.’ అని క్యాప్షన్ పెట్టారాయన. కాగా, మార్చిలో ఐటీబీపీ జవాన్లు హిమాచల్ ప్రదేశ్‌లోని మంచు పర్వతాల్లో కొందరు జవాన్లు కబడ్డీ ఆడుతున్న వీడియోను కూడా ఐటీబీపీ అధికారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.