Karnataka News: పుణ్యం కోసం రామకోటి రాస్తారు..మరీ ఈ సారీ కోటి ఏంటో..? ఎటు చూసినా సారీ, సారీయే..
పుణ్యం కోసం మన పెద్దవాళ్లు చాలా మంది రామ కోటి రాస్తుంటారు..ఇది మన అందరికీ తెలిసింది..కానీ, ఎక్కడైనా, ఎప్పుడైనా సారీ , సారీ నామ జపం విన్నారా..? ఖచ్చితంగా లేదనే చెబుతారు. కానీ, ఓ చోట స్కూల్
పుణ్యం కోసం మన పెద్దవాళ్లు చాలా మంది రామ కోటి రాస్తుంటారు..ఇది మన అందరికీ తెలిసింది..కానీ, ఎక్కడైనా, ఎప్పుడైనా సారీ , సారీ నామ జపం విన్నారా..? ఖచ్చితంగా లేదనే చెబుతారు. కానీ, ఓ చోట స్కూల్ ఆవరణ, పాఠశాల గోడలు, లోనికి వెళ్లే మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ, సారీ అని రాసి ఉండటం సర్వత్రా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ విచిత్ర ఘటన కర్ణాటకలోని బెంగళూరులో చోటు చేసుకుంది. బెంగళూరులోని ఓ ప్రయివేటు పాఠశాల ఆవరణ, దాని చుట్టుపక్కల వీధుల్లో ఎరుపు రంగులో ‘సారీ.. సారీ.. సారీ` అనే రాయడం కలకలం రేపింది. ఈ ఘటన స్థానికులను, పాఠశాల అధికారులను ఆశ్చర్యపరిచింది. వివరాల్లోకెళ్తే..
బెంగళూరులోని సుంకడకట్టే ప్రాంతంలో శాంతిధామ పాఠశాల ఉంది. ఈ స్కూల్ ఎంట్రెన్స్ నుండి మొదలు పెడితే…, గోడలు, మెట్లపై సారీ.. సారీ.. సారీ అని కొందరు ఆకతాయిలు రాశారు. చుట్టుపక్కల వీధుల్లో అలాగే రాశారు. ఇదంతా చూసిన స్థానికులకు ఏమీ అర్థం కాలేదు..వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు చుట్టుపక్కల సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఓ ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై వచ్చి.. కళాశాల గోడల మీద, చుట్టుపక్కల వీధుల్లో సారీ..సారీ.. అంటూ రాసినట్లు ఫుటేజీ ద్వారా గుర్తించారు. ఇద్దరూ సాధారణంగా ఫుడ్ డెలివరీ బాయ్‌లు ఉపయోగించే పెద్ద బ్యాగ్‌ని మోస్తూ కనిపించారు. దాంతో వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాగా ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.