Monkeypox fear: హడలెత్తిస్తున్న మంకీఫాక్స్.. భారత్‌కూ పొంచిఉన్న ముప్పు.. అలర్ట్ అయిన కేంద్రం..!

Monkeypox fear: నిన్నటి దాకా కరోనా ఫియర్‌.. ఇప్పడు మంకీపాక్స్‌ వంతొచ్చింది. రెండు వారాల వ్యవధిలోనే 15 దేశాలకు వ్యాపించిన ఈ వైరస్‌ ఆందరినీ

Monkeypox fear: హడలెత్తిస్తున్న మంకీఫాక్స్.. భారత్‌కూ పొంచిఉన్న ముప్పు.. అలర్ట్ అయిన కేంద్రం..!
Monkeypox Disease
Follow us

|

Updated on: May 26, 2022 | 6:10 AM

Monkeypox fear: నిన్నటి దాకా కరోనా ఫియర్‌.. ఇప్పడు మంకీపాక్స్‌ వంతొచ్చింది. రెండు వారాల వ్యవధిలోనే 15 దేశాలకు వ్యాపించిన ఈ వైరస్‌ ఆందరినీ ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ఈ వైరస్‌ మీద దృష్టి సారించింది. మరోవైపు భారత్‌కూ మంకీపాక్స్‌ వైరస్‌ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది.

రెండున్నరేళ్లుగా ప్రపంచాన్ని తీవ్రంగా వణికించిన కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టిందనే ఆనందం కాస్తా ఆవిరవుతోంది. ఇప్పుడు మంకీపాక్స్‌ వైరస్‌ కలవర పెడుతోంది.. అగ్రరాజ్యంలో ఇప్పటికే ఆందోళన మొదలైంది. బోస్టన్‌ నగరంలో ఒక కేసు వెలుగు చేసింది. మరి కొందరి ఆనుమానితులకు పరీక్షలు నిర్వహించారు. కెనడా, బ్రిటన్‌, ఇటలీ, ఫ్రాన్స్‌, స్వీడెన్‌, స్విట్జర్లాండ్‌, స్పెయిన్‌, జర్మనీ, నెదర్లాండ్‌, బెల్జియం, ఇజ్రాయిల్‌, ఆస్ట్రేలియా తదితర దేశాలతో కలిపి ఇప్పటి వరకూ వంద కేసులు నమోదయ్యాయి. ఇందులో 90కి పైగా కేసులు అధికారికంగా నిర్ధారించారు.. మరికొన్ని అనుమానిత కేసులను పరిశీలిస్తున్నారు.

భారత్‌కూ మంకీపాక్స్‌ ముప్పు పొంచి ఉందనే హెచ్చరికలు రావడంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్పమత్తం చేసింది.. ఇప్పటికే ముంబైలో ఐసోలేషన్‌ వార్డు ఏర్పాటు చేశారు. మంకీపాక్స్‌ అనుమానిత కేసుల్ని గుర్తిస్తే వెంటనే ఐసోలేషన్‌లో ఉంచి తగు చికిత్స అందించాలని తమిళనాడు ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు కీలక సూచనలు చేసింది. గత 21 రోజులుగా ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ల ఆరోగ్యంపై నిఘా ఉంచాలని ఆదేశించింది. మంకీపాక్స్‌ మరి కొన్న దేశాలకూ విస్తరించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తోంది.

ఇవి కూడా చదవండి

మంకీపాక్స్‌ కరోనా వైరస్‌లా ప్రమాదకరంగా మారుతుందా అనే భయాందోళనలు రేకెత్తుతున్నాయి. అయితే ఈ వైరస్‌ గాలి ద్వారా వ్యాపించే అవకాశం లేదని, కరోనాతో పోలిస్తే వ్యాప్తి తక్కువ అంటున్నారు డబ్ల్యూహెచ్‌ఓ అధికారులు.. మశూచి టీకాతో మంకీపాక్స్‌ను నయం చేయవచ్చని, ఆందోళన వద్దని చెబుతున్నారు. మంకీ పాక్స్‌ మొదల ఆఫ్రికా దేశాల్లో మొదలైంది. అక్కడి నుంచి ఇతర దేశాలకు వ్యాపించింది.. తాజా వ్యాప్తిలో ఎక్కడా మరణాలు నమోదు కాకపోవడం ఊరట కలిగిస్తోంది. మంకీపాక్స్‌ మూలాలను కనుక్కోవడంతోపాటు వైరస్‌లో మార్పులను తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.

ప్రపంచంలోనే అత్యంత అందమైన ఎక్స్‌ప్రెషన్స్ ఇవే
ప్రపంచంలోనే అత్యంత అందమైన ఎక్స్‌ప్రెషన్స్ ఇవే
మా పిల్లి తప్పిపోయింది... ఎక్కడైనా కనిపిస్తే చెప్పండి..?పోస్టర్లు
మా పిల్లి తప్పిపోయింది... ఎక్కడైనా కనిపిస్తే చెప్పండి..?పోస్టర్లు
కాంగ్రెస్ నుంచి కొనసాగుతున్న వలసల ప్రవాహం
కాంగ్రెస్ నుంచి కొనసాగుతున్న వలసల ప్రవాహం
చెవి నొప్పిని నిర్లక్ష్యం చేస్తే వెలకట్టలేని మూల్యం చెల్లిచాలి..
చెవి నొప్పిని నిర్లక్ష్యం చేస్తే వెలకట్టలేని మూల్యం చెల్లిచాలి..
నవీన్ పొలిశెట్టికి బైక్ యాక్సిడెంట్.. షూటింగ్‏కు బ్రేక్ ?..
నవీన్ పొలిశెట్టికి బైక్ యాక్సిడెంట్.. షూటింగ్‏కు బ్రేక్ ?..
మొసలితో తలపడ్డ తాబేలు.. ! చివరిదాకా పోరాడింది.. కట్‌చేస్తే..
మొసలితో తలపడ్డ తాబేలు.. ! చివరిదాకా పోరాడింది.. కట్‌చేస్తే..
ఓట‌రు గుర్తింపు కార్డుని డౌన్ లోడ్ చేసుకోండిలా ??
ఓట‌రు గుర్తింపు కార్డుని డౌన్ లోడ్ చేసుకోండిలా ??
సీనియారిటీ కాదు.. సిన్సియారిటీ చూసి ఓటెయ్యాలి: వైఎస్ జగన్
సీనియారిటీ కాదు.. సిన్సియారిటీ చూసి ఓటెయ్యాలి: వైఎస్ జగన్
వేయించిన శనగల్లో కాస్తింత బెల్లం వేసుకుని తింటే.. జరిగేది ఇదే
వేయించిన శనగల్లో కాస్తింత బెల్లం వేసుకుని తింటే.. జరిగేది ఇదే
మీ గార్డెన్‌లో మొక్కలకు కోకోపీట్‌ వాడుతున్నారా..? ఇంట్లోనే తయారీ
మీ గార్డెన్‌లో మొక్కలకు కోకోపీట్‌ వాడుతున్నారా..? ఇంట్లోనే తయారీ