8 Yrs of Modi Govt: దేశ రక్షణ విషయంలో తగ్గేదేలే.. 8 ఏళ్ల మోదీ పాలనలో పాకిస్థాన్‌ను వణికించిన సంఘటనలు..
8 Yrs of Modi Govt: బీజేపీ అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి దేశ భద్రతకు పెద్ద పీట వేసింది. రక్షణ రంగానికి భారీ ఎత్తున నిధులు కేటాయించడం, దేశ భద్రత విషయంలో డేరింగ్ నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు...
8 Yrs of Modi Govt: బీజేపీ అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి దేశ భద్రతకు పెద్ద పీట వేసింది. రక్షణ రంగానికి భారీ ఎత్తున నిధులు కేటాయించడం, దేశ భద్రత విషయంలో డేరింగ్ నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్లింది. ముఖ్యంగా దేశంలో దాడులకు దిగిన పాకిస్థానీ ఉగ్రమూకలను ఉపేక్షించేది లేదని మోదీ పలుసార్లు ప్రస్తావించారు. ఈ క్రమంలోనే భారత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉగ్రమూకల స్థావరాల వద్దకు నేరుగా వెళ్లి వారిపై దాడులు చేసిన విషయం తెలిసిందే. 2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ దేశ చరిత్రలో ఎప్పటికీ మరిచిపోలేని ఘటనగా నిలిచింది. ఇంతటీ సాహసోపేత నిర్ణయం తీసుకున్న మోదీకి దేశ ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్ధతు లభించింది. ఇక బాలకోట్‌లో జరిగిన వైమానిక దాడులతో బీజేపీ ప్రభుత్వం మరోసారి పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరిక చేసింది. భారత దేశంలో శాంతిని విఘాత పరిచేందుకు కుట్రలు చేస్తే రియాక్షన్ ఇలానే ఉంటుందని మోదే చెప్పకనే చెప్పారు.
పుల్వామా దాడులకు ప్రతీకారంగా 2016లో సర్జికల్ స్ట్రైక్, బాలాకోట్‌లోని ఉగ్రమూకలపై వైమానిక దాడులు చేసిన పెద్ద సాహసమే చేసింది మోదీ సర్కారు. అంతర్జాతీయంగా ఎలాంటి ప్రతిస్పందన వస్తుందన్న ఆలోచన చేయకుండా, దేశ ప్రయోజనాల కోసం తమ ప్రభుత్వం ఎంత దూరమైనా వెళుతుందని మోదీ సందేశం ఇచ్చారు. ఈ సంఘటనల ద్వారా భారత ఆర్మీ శక్తి ప్రపంచానికి రుజువైంది. ఈ ఆపరేషన్‌లు విజయవంతం కావడంతో సాయుధ దళాల్లోనూ ధైర్యం నిండింది. సైనిక చర్యలతోనే కాకుండా మోదీ విదేశాంగ విధానం విషయంలోనూ పాకిస్తాన్‌ను ఇరుకున పెట్టారు. ఉగ్రవాదులను తయారు చేసే కేంద్రంగా పాక్ ఉందన్న విషయాన్ని మోదీ ప్రపంచ దేశాలకు తెలిసేలా చేశారు.
సర్జికల్ స్ట్రైక్ జరిగిన తీరు..
ఉరిలోని భారత సైనిక స్థావరంపై జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా పాక్ ఆక్రమిత్ కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై 2016, సెప్టెంబర్ 28న సర్జికల్ స్ట్రైక్‌ను నిర్వహించింది ఇండియన్ ఆర్మీ. భారత సైనికులను హతమార్చిన ఉగ్రమూక ఆటకట్టించేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని అప్పట్లో మోదీ తెలిపారు. దీంతో మోదీకి దేశ ప్రజల్లో మరింత ఆదరణ పెరిగింది. దేశ భద్రత విషయంలో మోదీ ప్రజల నమ్మకాన్ని చూరగొన్నారు.
బాలకోట్ వైమానిక దాడి..
బాలాకోట్ వైమానికి దాడి 2019 ఫిబ్రవరి 26 జరగింది. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ ఈ ఆపరేషన్‌ను చేపట్టింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన మిరాజ్ 2000 యుద్ధ విమానాలు నియంత్రణ రేఖ దాటి పాక్‌లోని బాలాకోట్‌లో ఉన్న జైష్-ఎ-మహ్మద్ ఉగ్రవాద శిబిరాన్ని ధ్వంసం చేశాయి. ఈ ఆపరేషన్‌లో భాగంగా పాక్ భూభాగంలో విమానం కూలిపోవడంతో వింగ్ కమాండర్ అభినందన్ పాక్ ఆర్మీకి చిక్కారు. అయితే అందరూ ఆందోళన చెందుతోన్న సమయంలో మోదీ తనదైన చాణిక్యాన్ని ప్రదర్శించి అభినందన్‌ను కేవలం 24 గంటల్లోనే భారత్‌కు సురక్షితంగా రప్పించగలిగారు. ఈ అంశం కూడా దేశ ప్రజల్లో మోదీపై నమ్మకాన్ని రెట్టింపు చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..