China vs Quad Meeting: క్వాడ్‌ సదస్సుపై రగిలిపోతోన్న చైనా.. రష్యాతో కలిసి ఏం చేసిందంటే..

China vs Quad Meeting: ఓవైపు క్వాడ్‌ సదస్సు జరుగుతున్న వేళ జపాన్‌ గగనతలంలో చైనాతో పాటు రష్యా యుద్ద విమానాలు చక్కర్లు కొట్టాయి.

China vs Quad Meeting: క్వాడ్‌ సదస్సుపై రగిలిపోతోన్న చైనా.. రష్యాతో కలిసి ఏం చేసిందంటే..
Jets Fly
Follow us
Shiva Prajapati

|

Updated on: May 25, 2022 | 9:32 PM

China vs Quad Meeting: ఓవైపు క్వాడ్‌ సదస్సు జరుగుతున్న వేళ జపాన్‌ గగనతలంలో చైనాతో పాటు రష్యా యుద్ద విమానాలు చక్కర్లు కొట్టాయి. కయ్యానికి కాలు దువ్వడానికి రెడీగా ఉన్నట్టు సంకేతాన్ని పంపించాయి. అవును, క్వాడ్‌ సదస్సుపై రగిలిపోతోంది చైనా. ఓవైపు జపాన్‌లో క్వాడ్‌ సదస్సు జరుగుతున్న వేళ డ్రాగన్‌ రష్యాతో కలిసి రెచ్చగొట్టే పనులు చేసింది. నలుగురు దేశాధినేతల సమావేశమైన జపాన్‌ గగనతలంలో చైనా, రష్యా యుద్దవిమానాలు చక్కర్లు కొట్టాయి. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ జపాన్‌లో ఉండగానే చైనా, రష్యా బాంబర్లు యుద్ద విన్యాసాలు చేశాయి. ఆసియాలో మరో నాటో కూటమిని తాము ఒప్పుకునే ప్రసక్తే లేదని అంటోంది చైనా.

ఇక క్వాడ్‌ సదస్సులో ఉక్రెయిన్‌పై చేసిన వ్యాఖ్యలు రష్యాకు నచ్చలేదు. అందుకే చైనాకు తోడుగా రష్యా యుద్ద విమానాలు కూడా విన్యాసాల్లో పాల్గొన్నాయి. అమెరికా, జపాన్‌, భారత్‌, ఆస్ట్రేలియా క్వాడ్‌ కూటమిగా ఏర్పడ్డాయి. రెండు రోజుల పాటు టోక్యోలో క్వాడ్‌ దేశాధినేతలు సమావేశమయ్యారు. ఇండో-పసిఫిక్‌ తీరంలో ఎలాంటి సరిహద్దు మార్పులను అంగీకరించలేదని క్వాడ్‌ కూటమి హెచ్చరించింది. తైవాన్‌పై చైనా దాడి చేస్తే తాము రంగంలోకి దిగుతామని క్వాడ్‌ కూటమి వేదికగా హెచ్చరించారు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌.

తమ తీరం సమీపంలో చైనా-రష్యా వైమానిక విన్యాసాలపై జపాన్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గత నవంబర్‌ నుంచి జపాన్‌ సమీపంలో రష్యా-చైనా విమానాలు చక్కర్లు కొట్టడం ఇది నాలుగోసారి. క్వాడ్‌ దేశాలను రెచ్చగొట్టేందుకే చైనా-రష్యా ఈ విన్యాసాలు చేశాయని జపాన్‌ మండిపడింది.

ఇవి కూడా చదవండి

ఉక్రెయిన్‌, తైవాన్‌ను ఎవరైనా ఆక్రమించాలని ప్రయత్నిస్తే ప్రతిఘటన తప్పదని క్వాడ్‌ కూటమి చైనా, రష్యాలను సంయుక్తంగా హెచ్చరించాయి. రెచ్చగొట్టే విధానాన్ని మానుకోవాలని చైనాను పలుమార్లు దౌత్యపరంగా కోరినట్టు వెల్లడించింది చైనా విదేశాంగశాఖ. ఓవైపు ఉక్రెయిన్‌పై దాడి విషయంలో రష్యాను ప్రపంచ దేశాలు నిందిస్తుంటే చైనా అండగా నిలవడం ఆందోళన కలిగిస్తోందని తెలిపింది.

జపాన్‌ తన సరిహద్దులను కాపాడుకోవడానికి గట్టి నిఘా పెట్టాల్సి వస్తోంది. ఏడాది కాలంలో జపాన్‌ 1004 సార్లు యుద్ద విమానాలు సరిహద్దులకు పంపించాల్సి వచ్చింది.

క్రిమినల్‌ ఆచూకీ చెప్పండి.. పోలీసుల పావలా రివార్డు అందుకోండి..
క్రిమినల్‌ ఆచూకీ చెప్పండి.. పోలీసుల పావలా రివార్డు అందుకోండి..
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. శబరిమలకు అదనపు విమాన సర్వీసులు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. శబరిమలకు అదనపు విమాన సర్వీసులు
ఈ సమస్యలున్నవారు పొరపాటున కూడా అనాస తినొద్దు ఎందుకంటే..
ఈ సమస్యలున్నవారు పొరపాటున కూడా అనాస తినొద్దు ఎందుకంటే..
కడప దర్గాను దర్శించుకున్న రామ్ చరణ్..
కడప దర్గాను దర్శించుకున్న రామ్ చరణ్..
విమానంలో సిగరెట్‌ తాగిన ప్రయాణికుడి అరెస్టు
విమానంలో సిగరెట్‌ తాగిన ప్రయాణికుడి అరెస్టు
ఉదయమా.? సాయంత్రమా.? ఏ సమయంలో వాకింగ్ చేస్తే బరువు తగ్గుతారంటే..
ఉదయమా.? సాయంత్రమా.? ఏ సమయంలో వాకింగ్ చేస్తే బరువు తగ్గుతారంటే..
ఇస్రోతో జతకట్టిన ఎలన్ మస్క్.. కారణం తెలిస్తే అవాక్ అవ్వాల్సిందే
ఇస్రోతో జతకట్టిన ఎలన్ మస్క్.. కారణం తెలిస్తే అవాక్ అవ్వాల్సిందే
బంగారపు టూత్ బ్రష్‌తో టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా?
బంగారపు టూత్ బ్రష్‌తో టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా?
హైవేపై రెడ్ కారు రెక్‌లెస్ డ్రైవింగ్.. పోలీసుల ఎంట్రీతో
హైవేపై రెడ్ కారు రెక్‌లెస్ డ్రైవింగ్.. పోలీసుల ఎంట్రీతో
2025లో మహా కుంభమేళా ఎప్పుడు ప్రారంభం.. ఎక్కడ జరగనున్నాయంటే
2025లో మహా కుంభమేళా ఎప్పుడు ప్రారంభం.. ఎక్కడ జరగనున్నాయంటే