Inspiring Story: ఒక్క ఐడియా వారి జీవితాన్ని మార్చేసింది.. పూల వ్యాపారంతో కోట్లు ఆర్జిస్తున్న సిస్టర్స్..

. మనం ఇంట్లో ఉండగానే నిత్యావసర వస్తువులు, పాలు, పేపర్ వంటికి ఉదయమే ఇంటికి చేరుకుంటుంది. ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన అనంతరం ఇది మరింత ఈజీగా మారింది.

Inspiring Story: ఒక్క ఐడియా వారి జీవితాన్ని మార్చేసింది.. పూల వ్యాపారంతో కోట్లు ఆర్జిస్తున్న సిస్టర్స్..
Bangalore Sisters Flower Bu
Follow us

|

Updated on: May 26, 2022 | 1:28 PM

Inspiring Story: జీవితంలో ఏర్పడే అవసరం అన్ని నేర్పిస్తుంది. తమకు ఎదురయ్యే ప్రతి సమస్యకు పరిష్కారం కోసం వెదికే ప్రయత్నంలో సరికొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తాయి. కొన్ని కొన్ని ఆలోచనలు సక్సెస్ తో పాటు.. పదిమందికి స్ఫూర్తిగా నిలుస్తాయి. సామాన్యులు కూడా సమాజంలో తమకంటూ ఓ ఫేమ్ ని సంపాదించుకుంటారు. అలాంటి ఓ ఆలోచన అక్కచెల్లల జీవితాన్ని మార్చేసింది. రోజూ ఇంట్లో చేసే పూజకు లేదా గుడికి తీసుకుని పువ్వులను ఉపయోగిస్తాం.. అయితే కాలక్రమంలో ఇంట్లో పువ్వుల మొక్కలను పెంచుకునే చోటు లేకపోవడంతో.. పువ్వులను మార్కెట్ లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనినే స్ఫూర్తిగా తీసుకున్న అక్కచెల్లెలు గుడికి తీసుకుని వెళ్లే పువ్వులతోనే వ్యాపారం చేసి..  తమకంటూ వ్యాపార రంగంలో పేజీని సొంతం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..

బెంగళూరుకు చెందిన యశోద కరుటూరి, రియా అక్కాచెల్లెలు. అక్కాచెల్లెలు బెంగళూరులోకి ఇథియోపియాలోని పాఠశాలలో విద్యనభ్యసించారు. యశోద సెయింట్ లూయిస్‌లోని వాషింగ్టన్ యూనివర్శిటీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. అయితే వ్యాపారంగా పువ్వులను డోర్ డెలివరీ చేయాలనుకున్నారు రోజు ఉదయం.. మనం ఇంట్లో ఉండగానే నిత్యావసర వస్తువులు, పాలు, పేపర్ వంటికి ఉదయమే ఇంటికి చేరుకుంటుంది. ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన అనంతరం ఇది మరింత ఈజీగా మారింది. తాము ఆన్ లైన్ లో ఏది ఆర్డర్ చేసినా వెంటనే మన ముంగిట వాలిపోతుంది. దీనిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్న యశోద రియాలు తాము కూడా పువ్వులను ఇంటికి డోర్ డెలివరీ చేయాలనీ భావించారు.

తాజా పువ్వులు గులాబీలు, చామంతి, తామరపువ్వులు వంటి అనేక రకాల పువ్వులను ఇంటికే డెలివరీ చేసే స్టార్టప్ ను అక్కచెల్లెలు ప్రారంభించారు. దీనికి హూవూ (కన్నడలో ‘పువ్వులు’) అనే పేరు పెట్టారు. ముందుగా రూ. 10 లక్షల పెట్టుబడితో బిజినెస్ ను ప్రారంభించారు. ఇక హూవూ ఇప్పుడు ఏటా రూ.8 కోట్ల టర్నోవరు సాధిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఫ్లవర్ బొకే మార్కెట్ చాలా అభివృద్ధి చెందినప్పటికీ, సాంప్రదాయ పూజకు ఉపయోగించే పూల మార్కెట్ అంతగా అభివృద్ధి చెందలేదని గుర్తించారు. అంతేకాదు నిజానికి వినియోదారులకు ఎక్కువగా ఫ్లవర్ బోకేల్లో వాడే పూల కంటే.. పూజకు ఉపయోగించే పువ్వులే కావాలని గుర్తించారు. దీంతో 2019లో ఈ అక్కాచెల్లెల్లు ఇద్దరూ పూల మార్కెట్‌కు సబ్‌స్క్రిప్షన్ సిస్టమ్‌ ప్రవేశ పెట్టి.. తమ వ్యాపారానికి ఆధునిక మలుపుని తీసుకొచ్చారు. దీంతో పువ్వుల డోర్ డెలివరీ వ్యాపారం మరింత విస్తరించింది.

హూవు ద్వారా కస్టమర్స్ కు తాజా పువ్వులను అందిస్తున్నారు. పువ్వులు తాజాగా ఉండేలా నాణ్యమైన ప్యాకింగ్ తో  కస్టమర్స్ కు డెలివరీ చేస్తున్నారు. ఈ ప్యాకింగ్ వలన పువ్వులు దాదాపు 15 రోజుల వరకూ ప్రెష్ గా ఉంటాయి. తాజాగా పువ్వుల కోసం నేరుగా రైతులతో టైఅప్ అయ్యారు. ఇప్పుడు ఈ అక్కచెల్లెలు.. తమ హూవూ.. ద్వారా సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకూ ఆర్డర్లు అందుకుంటున్నారు. మేము మా వెబ్‌సైట్ ద్వారా కాకుండా బిగ్ బాస్కెట్, గ్రోఫర్స్, సూపర్ డైలీ, జొమాటో, మిల్క్‌బాస్కెట్, ఎఫ్‌టిహెచ్ డైలీ , జెప్టో వంటి విభిన్న ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కస్టమర్స్ నుంచి ఆర్డర్లు అందుకుంటున్నట్లు యశోద చెప్పారు.

బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, మైసూర్, పూణే, ముంబై, గురుగ్రామ్, నోయిడా సహా అనేక ప్రాంతాల నుంచి ఆర్డర్లు అందుకుంటున్నారు. ఇలా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఆర్డర్లు  నెలకు సుమారు 1,50,000 లు ఉంటాయని అక్కాచెల్లెళ్లు చెప్పారు. ఓ తాజా పువ్వులను వినియోగదారులకు అందిస్తూనే..  మరోవైపు పువ్వులతో అగర్బత్తీల తయారీని కూడా మొదలు పెట్టారు. ఇది కూడా ప్రస్తుతం లాభాల బాటలోనే నడుస్తున్నట్లు చెప్పారు.

మరిన్ని లైఫ్ స్టైల్ స్టోరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
రాజ్ బిడ్డ తల్లి పేరు మాయ.. దెబ్బకు దెబ్బ కొట్టిన స్వప్న..
రాజ్ బిడ్డ తల్లి పేరు మాయ.. దెబ్బకు దెబ్బ కొట్టిన స్వప్న..
తీవ్రమైన అనారోగ్యం లేకుండా 50 ఏళ్లు ఆస్పత్రిలోనే గడిపిన వ్యక్తి..
తీవ్రమైన అనారోగ్యం లేకుండా 50 ఏళ్లు ఆస్పత్రిలోనే గడిపిన వ్యక్తి..
115 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన శాపగ్రస్త ఓడ.. మళ్లీ తెరపైకి
115 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన శాపగ్రస్త ఓడ.. మళ్లీ తెరపైకి
లైంగిక వేధింపుల కేసులో రేవణ్ణ కుటుంబ సభ్యులకు బిగుస్తున్న ఉచ్చు!
లైంగిక వేధింపుల కేసులో రేవణ్ణ కుటుంబ సభ్యులకు బిగుస్తున్న ఉచ్చు!
సమ్మర్‌లో మీ ఇంట్లో కరెంటు బిల్లు పెరిగిపోతోంది.. ఈ పరికరంతో..
సమ్మర్‌లో మీ ఇంట్లో కరెంటు బిల్లు పెరిగిపోతోంది.. ఈ పరికరంతో..
కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??
కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??
పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా ??
పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా ??
నిద్రలేచిన వెంటనే ఈ పనులు చేయండి.. ఇక ఆ సమస్య అన్న మాటే ఉండదు..
నిద్రలేచిన వెంటనే ఈ పనులు చేయండి.. ఇక ఆ సమస్య అన్న మాటే ఉండదు..
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10 వేల కోట్లు
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10 వేల కోట్లు
వందే భారత్‌ మెట్రో ఫస్ట్‌ లుక్‌.. ఎలా ఉందంటే ??
వందే భారత్‌ మెట్రో ఫస్ట్‌ లుక్‌.. ఎలా ఉందంటే ??