Beauty tips: ఈ సింపుల్ ఫేస్ ప్యాక్‌తో ముఖంపై మచ్చలు ఇట్టే మాయమవుతాయి..ఎలా తయారుచేయాలంటే..
ముఖంపై నల్లని మచ్చలు వికారంగా కనిపిస్తున్నాయా? ఈ సింపుల్ చిట్కాతో మచ్చలేని మోము మీసొంతం చేసుకోండి. ఇంట్లో దొరికే వాటితో సింపుల్ గా ఎలా తయారు చేసుకోవచ్చో మీకోసం..
How to get rid of dark spots on the face: ముఖంపై నల్లని మచ్చలు వికారంగా కనిపిస్తున్నాయా? ఈ సింపుల్ చిట్కాతో మచ్చలేని మోము మీసొంతం చేసుకోండి. వంటింట్లో దొరికే ఈ పదర్ధాలతో ఫేస్ ప్యాక్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. తయారీ విధానం మీకోసం..
- ముందుగా క్యారెట్, నిమ్మకాయ, బంగాళ దుంప ఒక్కోటిగా తీసుకుని శుభ్రంగా కడిగి తడిలేకుండా తుడుచుకోవాలి
- తర్వాత ఈ మూడింటిని తొక్క తీయకుండా సన్నగా తురుముకోవాలి
- వీటన్నిటినీ ఒక గిన్నెలో వేసి బాగా కలిపి 24 గంటలపాటు మూతపెట్టి ఉంచాలి
- తరువాత గిన్నెలో ఉన్న తురుమును వడగట్టి నీటిని వేరు చేసి ఒక గిన్నెలో మూడు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్, వడగట్టి పెట్టుకున్న రసం మూడు టీస్పూన్లు వేసి, కొద్దిగా బాదం నూనెవేసి పేస్టులా కలుపుకోవాలి
- చివరిగా ఈ విటమిన్ క్యాప్యూల్స్ ఒకటి వేసి కలిపితే క్రీం రెడీ అయినట్లే.
- దీనిని గాజు సీసాలో స్టోర్ చేసుకుని రోజూముఖానికి రాసుకుంటే నల్లని మచ్చలు తగ్గి, ముఖ కాంతి పెరుగుతుంది.
ఇవి కూడా చదవండి
ఈ మిశ్రమాన్ని రోజుకు రెండుసార్లు ముఖానికి రాసుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది.