Bus Accident: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు బోల్తా.. 12 మంది దుర్మరణం

Bus Accident in Mexico: మెక్సికో దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారిపై బస్సు బోల్తా పడిన దుర్ఘటనలో

Bus Accident: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు బోల్తా.. 12 మంది దుర్మరణం
Road Accident
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 16, 2021 | 8:47 AM

Accident in Mexico: మెక్సికో దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారిపై బస్సు బోల్తా పడిన దుర్ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈశాన్య మెక్సికోలోని తమౌలిపాస్ రాష్ట్రంలో.. అమెరికా బోర్డర్‌లో ఈ సంఘటన జరిగిందని అధికారులు వెల్లడించారు. రహదారిపై వేగంగా వస్తున్న బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురిని ఆసుపత్రికి తరలించిన అనంతరం మరణించారని అధికారులు తెలిపారు.

రేనోసా-న్యువోలియోన్ మోంటెర్రేల మధ్య బస్సు వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించిందని మెక్సికో అధికారులు తెలిపారు. బస్సుపై డ్రైవరు నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. ఈ ఘటనలో మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారని.. వారందరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. సమాచారం అందుకోగానే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టామన్నారు.

Also Read;

Love: ప్రేమించిందని దారుణం.. యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కుటుంబ సభ్యులు

Agra: గోడ కూలి ముగ్గురు చిన్నారుల దుర్మరణం.. మరి కొంతమందికి గాయాలు..