Agra: గోడ కూలి ముగ్గురు చిన్నారుల దుర్మరణం.. మరి కొంతమందికి గాయాలు..
Wall Collapsed: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఆగ్రా జిల్లాలోని కగరోల్ గ్రామంలో మంగళవారం రాత్రి గోడ కూలి
Wall Collapsed: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఆగ్రా జిల్లాలోని కగరోల్ గ్రామంలో మంగళవారం రాత్రి గోడ కూలి ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు బాలికలు, ఓ బాలుడు ఉన్నారని.. వారందరి వయస్సు 3 నుంచి 8 మధ్య ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఈ సంఘటన అనంతరం స్థానికులు వెంటనే స్పందించి శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
శిథిలాల్లో మొత్తం 9 మంది చిక్కుకున్నారని.. వారందరినీ రక్షించి, ఆసుపత్రికి తరలించినట్లు జిల్లా మెజిస్ట్రేట్ ప్రభు ఎన్ సింగ్ తెలిపారు. అయితే.. ఆసుపత్రికి తీసుకెళ్లిన అనంతరం ముగ్గురు పిల్లలు మరణించినట్లు వైద్యులు వెల్లడించారని తెలిపారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు సింగ్ వెల్లడించారు. ఈ సంఘటన అనంతరం కగరోల్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు స్థానికుల నుంచి పలు వివరాలు సేకరించారు.
Agra: Three children died, while others injured after a wall collapsed in Kagarol
“Two girl & a boy (btw 3-8 years old) was brought dead at the hospital. Injureds are being treated. Total 9 people were trapped,” says Agra District Magistrate Prabhu N Singh pic.twitter.com/YdTdb9gNiP
— ANI UP (@ANINewsUP) June 15, 2021
Also Read: