Horoscope Today: ఆ రాశి వారు అనుమానాలను వీడాలి.. బుధవారం రాశి ఫలాలు..

Rasi Phalalu: మనం ఎల్లప్పుడూ అప్రమత్తతతో.. జాగ్రత్తగా వ్యవహరిస్తుంటాం. ఇలాంటి సందర్భంలో.. చాలాసార్లు అవసరం లేని విషయాల్లో కూడా తల దూర్చడానికి

Horoscope Today: ఆ రాశి వారు అనుమానాలను వీడాలి.. బుధవారం రాశి ఫలాలు..
Horoscope Today
Follow us

|

Updated on: Jun 16, 2021 | 7:54 AM

Rasi Phalalu: మనం ఎల్లప్పుడూ అప్రమత్తతతో.. జాగ్రత్తగా వ్యవహరిస్తుంటాం. ఇలాంటి సందర్భంలో.. చాలాసార్లు అవసరం లేని విషయాల్లో కూడా తల దూర్చడానికి ప్రయత్నిస్తుంటాం. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంటుంది. ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో జీవితాలు ఆగం అవుతుంటాయి. కావున తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ, చేపట్టే ప్రతీ కార్యక్రమంలోనూ ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. బుధవారం పలు రాశుల వారికి పరిస్థితులు అనుకూలంగా లేవు. మరికొన్ని రాశుల వారికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. అసలు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు కలగనున్నాయో.. ఓ సారి చూద్దాం.

మేష రాశి: ఈ రాశి వారు ఈ రోజు షేర్లు, పెట్టుబడుల విషయాల్లో ఏమాత్రం తొందరపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికంగా చిన్నచిన్న ఒత్తిళ్లు ప్రారంభమవుతుంటాయి. శనిస్తోత్ర పారాయణం మేలు చేస్తుంది

వృషభరాశి: ఈ రాశి వారికి సంఘంలో గౌరవాలు పెరుగుతూ ఉంటాయి. ఆస్థి వ్యవహారిక విషయాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సుబ్రహ్మణ్వేశ్వర స్వామి వారి అర్చన నిర్వహించుకోవడం మంచిది.

మిథున రాశి: ఈ రాశి వారు ఈ రోజు వేరు వేరు రూపాల్లో కొన్ని పనులు చేపడుతుంటారు. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. గౌరి అమ్మవారి అర్చన మేలు చేస్తుంది.

కర్కాటక రాశి: ఈ రాశి వారికి స్వల్ప అనారోగ్యమైనటువంటి భావనలు ఏర్పడుతుంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. శివాలయ దర్శనం నందీశ్వరుని సేవ మేలు చేస్తుంది.

సింహ రాశి: ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితులు కొంత మిశ్రమంగా ఉంటాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సూర్యనారాయణ స్వామి ఆరాధన చేసుకొని.. గోధుమరవ్వ పాయసం నివేదన చేసుకోవడం మంచిది.

కన్యా రాశి : ఈ రాశి వారికి స్నేహితులను, బంధువులను కలుసుకోవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. పరిచయాలను వృథా చేసుకోవడం మంచిది కాదు. గౌరీశంకరుని దర్శనం మేలు చేస్తుంది.

తులా రాశి: ఈ రాశి వారు దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికారులను కలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఈ క్రమంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. శ్రీ రాజమాతంగి నమ: నామస్మరణ మేలు చేస్తుంది.

వృశ్చిక రాశి: ఈ రాశి వారు చేపట్టినటువంటి పనులు, పలు విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఆర్థిక పరిస్థితులు కొంతమేర వృద్ధిచెందుతాయి. నవగ్రహ పారాయణం, హనుమాన్ చాలిసా పారయణం మేలు చేస్తుంది.

ధనస్సు రాశి: ఈ రాశి వారు చేపట్టినటువంటి వ్యవహారికి విషయాల్లో పెద్దవారు, కుటుంబసభ్యుల సలహాలు సూచనలను ఆనందంగా స్వీకరిస్తుంటారు. చిన్నపిల్లల ఆరోగ్యం కుదుటపడుతూ ఉంటుంది. సుబ్రహ్మణ్వేశ్వర స్వామి అర్చన, చిన్ని కృష్ణునికి వెన్నను నివేదించుకోవడం మంచిది.

మకర రాశి: ఈ రాశి వారికి నూతనమైనటువంటి పనులు, వస్తులాభాలు ఏర్పడుతుంటాయి. ధార్మిక చింతన ఉంటుంది. ముఖ్యులను కలుసుకుంటారు. శ్రీ వేంకటేశ్వర స్వామి అర్చన మేలు చేస్తుంది.

కుంభ రాశి: ఈ రాశి వారికి గతంలో ఉన్న అనారోగ్య సమస్యలు కొంత బాధించే సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తలు, విశ్రాంతి తీసుకోవడం మంచిది. దుర్గాసప్తస్లోకి పారాయణం మేలు చేస్తుంది.

మీన రాశి: ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు ఉంటుంటాయి. అందివచ్చిన అవకాశాలను జాగ్రత్తగా స్వీకరిస్తూ ఉండాలి. చేపట్టినటువంటి పనులపై అనుమానాలను దూరం చేసుకోవాలి. దక్షిణమూర్తి, అష్టలక్ష్మిస్తోత్రపారాయణం మేలు చేస్తుంది.

Also Read:

Love: ప్రేమించిందని దారుణం.. యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కుటుంబ సభ్యులు

Jabardasth Hyper Aadi : వీడియో సందేశంలో తెలంగాణ ప్రజలను బహిరంగ క్షమాపణలు కోరిన జబర్దస్త్ ఫేం హైపర్ ఆది.!