Ukraine: చిత్రం తెచ్చిన తంట.. భగ్గుమన్న ఉక్రెయిన్.. ఇది అత్యంత ప్రమాదకర సంకేతమని మండిపాటు.. అసలు ఏంజరిగిందంటే
ఒక్కోసారి మంచి ఆలోచన కూడా అనేక విమర్శలకు దారి తీస్తుంది. సద్దుదేశంతో చేసే పని కూడా వివాదాలకు కారణమవుతూ ఉంటుంది. ప్రపంచంలో ప్రస్తుత పరిస్థితులపై చిత్రకారులు తమ కళా నైపుణ్యానికి పదునుపెట్టి.. ప్రజలకు అర్థం చేయించేలా ఎన్నో చిత్రాలు గీస్తారు. కొన్ని సందర్భాల్లో..
Ukraine: ఒక్కోసారి మంచి ఆలోచన కూడా అనేక విమర్శలకు దారి తీస్తుంది. సద్దుదేశంతో చేసే పని కూడా వివాదాలకు కారణమవుతూ ఉంటుంది. ప్రపంచంలో ప్రస్తుత పరిస్థితులపై చిత్రకారులు తమ కళా నైపుణ్యానికి పదునుపెట్టి.. ప్రజలకు అర్థం చేయించేలా ఎన్నో చిత్రాలు గీస్తారు. కొన్ని సందర్భాల్లో చిత్రకారులు గీసిన చిత్రాలు అనేక సమస్యలకు చక్కటి పరిష్కారం చూపించిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒక చిత్రం ఎన్నో అర్థాలనిస్తుంది. కేవలం ఒక బొమ్మే కదా అనుకుంటుంటాం. కాని ఆ బొమ్మే ఎన్నో వివాదాలకు కారణం అవుతుంది. సరిగ్గా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఆస్ట్రేలియాలో. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న వేళ.. ఇరు దేశాల మధ్య శాంతియుత ప్రయత్నాలను ప్రతిబింబించేలా గీసిన ఓ చిత్రం తీవ్ర దుమారానికి కారణమైంది. అసలు ఏంజరిగిందంటే.. ఉక్రెయిన్, రష్యా సైనికులు కౌగిలించుకున్నట్లు ఓ కుడ్య చిత్రాన్ని ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో ప్రదర్శించారు. పీటర సీటన్ అనే ఆర్టిస్ట్.. ఇరు దేశాల మధ్య శాంతియుత ప్రయత్నాలను ప్రతిబింబించేలా ఒకరాత్రంతా కష్టపడి ఈ ఆర్ట్ వేశాడు. అంతే దీనిపై ఉక్రెయిన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆబొమ్మపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఇది అత్యంత ప్రమాదకరమైన సంకేతమని పేర్కొంది.
ఆస్ట్రేలియాలో ఉక్రెయిన్ రాయబారి వసైల్ మైరోష్నిచెంకో మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌పై వ్లాదిమిర్ పుతిన్ పూర్తి స్థాయి దండయాత్ర వాస్తవికతను వక్రీకరించే ప్రయత్నమంటూ మండిపడ్డారు. ఈచిత్రం ఉక్రెయిన్ ప్రజల మనోభావాలను దెబ్బ తీసేలా ఉందన్నారు. బొమ్మ గీసిన ఆర్టిస్ట్‌కు బహుశా రష్యా ఆక్రమణ గురించి ఏమాత్రం అవగాహన లేకపోయి ఉండొచ్చని పేర్కొన్నారు. రష్యాను శాంతికాముక దేశంగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం దుర్మార్గమని, వేలమందిని బలిగొన్న ఈ మారణహోమంపై ఇలాంటి చిత్రం గీసి ప్రదర్శించడం సరికాదన్నారు. కలలో కూడా ఇలాంటి ఊహ సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు వసైల్ మైరోష్నిచెంకో. ఉక్రెయిన్ అభిప్రాయం తీసుకోకుండా.. ఉక్రెయిన్ కమ్యూనిటీని సంప్రదించకుండా ఆచిత్రాన్ని ప్రదర్శించడం విచారకరం అంటూ ట్విట్ చేశారు. వీలైనంత త్వరగా దానిని తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రముఖ సోషియాలజిస్ట్ ఓల్గా బోయ్‌చక్ కూడా ఈవ్యవహారంపై మండిపడ్డారు. నిందితుడిని, బాధితుడిని ఒకేలా చూపించే ప్రయత్నం సరికాదని, దీని వెనుక ఏదైనా కుట్ర ఉండొచన్న అనుమానాలు వ్యక్తం చేశారు. మరో వైపు ఆర్టిస్ గీసిన చిత్రానికి పాజిటివ్ కామెంట్లు, లైకులు దక్కినప్పటికీ.. విమర్శలు, అభ్యంతరాల నేపథ్యంలో దానిని తొలగించారుపీటర సీటన్. తాను గీసిన చిత్రాన్ని నెగెటివ్‌గా తీసుకుంటారని తాను అనుకోలేదని చెబుతూ.. క్షమాపణలు తెలియజేశారు.
Mural with embrace of Ukrainian and Russian soldier taken down in Melbourne
The mural by Peter Seaton was heavily criticized by @ambvasyl, ?? community in Australia & artist’s colleagues for creating a sense of false equivalency btw victim & aggressor https://t.co/1FbKgMM4QB pic.twitter.com/dTmVaKHmbr
— Euromaidan Press (@EuromaidanPress) September 5, 2022
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..