Gautam Gambhir: గౌతమ్ గౌంభీర్‌కు గండం.. బీసీసీఐ డెడ్‌లైన్?

రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్‌ల జోడీ సంయుక్తంగా టీమ్‌ఇండియా నాయకత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ జట్టు గెలిచిన దానికంటే ఎక్కువగా ఓడిపోయింది. వీరిద్దరి నాయకత్వంలో టీమిండియా ఇప్పటి వరకు చరిత్రలో ఇంత చెత్త పదర్శన ఎప్పుడు చేయలేదు. లంకలో వన్డే సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌ను చవిచూసిన రోహిత్ సేన, న్యూజిలాండ్‌పై స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో కూడా ఘోర పరాజయాన్ని చవిచూసింది.

Gautam Gambhir: గౌతమ్ గౌంభీర్‌కు గండం.. బీసీసీఐ డెడ్‌లైన్?
Gautam Gambir
Follow us
Velpula Bharath Rao

|

Updated on: Jan 01, 2025 | 7:24 PM

ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. దీంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌ల మధ్య సంబంధాలు చెడినట్లు వార్తలు వస్తున్నాయి. కెప్టెన్సీతో పాటు టెస్టు జట్టు నుంచి రోహిత్‌ను తప్పించడంపై ఓ వైపు చర్చ జరుగుతుండగా, మరోవైపు గంభీర్‌ను ప్రధాన కోచ్‌గా కొనసాగించాలా అనే చర్చ కూడా సాగుతోంది. అందుకే ఆసీస్‌తో టెస్టు సిరీస్ తర్వాత టీమ్ ఇండియాలో మార్పుల సీజన్ మొదలవుతుందని అంటున్నారు.

ఆస్ట్రేలియాలో టీమిండియా చెత్త ప్రదర్శనపై బీసీసీఐ గరంగా ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో టీమిండియా జట్టు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాడు. మెల్‌బోర్న్ టెస్టు సందర్భంగా రోహిత్ శర్మ కెప్టెన్సీ, రిటైర్‌మెంట్ గురించి ఆయన చర్చించినట్లు తెలిసింది.  క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం జనవరి 3 నుండి ప్రారంభమయ్యే సిడ్నీ టెస్టులో రోహిత్ టీమిండియా కెప్టెన్‌గా కనిపిస్తాడు. అతను జట్టులో ఆడటం ఖాయంగా కనిపిస్తుంది.

అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత రోహిత్ సారథ్యంలో జట్టు ప్రదర్శన, టెస్టు జట్టులో అతని స్థానం, రిటైర్‌మెంట్‌పై చర్చ జరుగుతుంది. ప్రస్తుతం భారత జట్టు పరిస్థితి దినదినం అధ్వానంగా మారుతుందని బీసీసీఐ అధికారులంతా ఆందోళన చెందుతున్నారు. అయితే ఇంతటి కీలకమైన ఈ సిరీస్ మధ్యలో తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవడం సరికాదని అందరూ సిరీస్ ముగిసే వరకు వేచి చూస్తున్నారని సమాచారం.

రాహుల్ ద్రవిడ్ తర్వాత టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన గౌతమ్ గంభీర్ నాయకత్వంలో భారత జట్టు శ్రీలంకలో వన్డే సిరీస్‌ను కోల్పోయింది. బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్ విజయంతో పాటు, గెలిచిన దానికంటే ఎక్కువ ఓడిపోయింది. అంతే కాకుండా ఆస్ట్రేలియా టూర్ మధ్యలో టీమిండియా అనుభవజ్ఞుడైన స్పిన్నర్ అశ్విన్ హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించడంతో జట్టులో ఏది సరైనదో అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బిజిటి టెస్ట్ సిరీస్‌కు జట్టు ఎంపికపై కూడా ప్రశ్నలు తలెత్తాయి.

అయితే అశ్విన్ నిర్ణయంలో భారత జట్టు ప్రధాన కోచ్ పాత్ర లేదని తెలుస్తుంది. గంభీర్‌ను పరిమిత ఓవర్లకు కోచ్‌గా కొనసాగిస్తూనే టెస్టు ఫార్మాట్‌కు మరొకరిని తీసుకొచ్చే పనిలో బీసీసీఐ ముందుకు వెళ్లే అవకాశం ఉందని సమాచారం. త్వరలో బోర్డుకు శాశ్వత సెక్రటరీ రాబోతున్నాడని, ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు ప్రదర్శన మెరుగుపడకుంటే గంభీర్‌ను తొలగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.  ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుండి ప్రారంభమై మార్చి 9 వరకు కొనసాగుతుంది. అంటే జనవరి 1 నుంచి మార్చి 9 వరకు పరిస్థితిని మార్చేందుకు గంభీర్‌కు ఇంకా 68 రోజుల సమయం మాత్రమే ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..