విజయనగరం జిల్లా రేగడిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చెరుకు తొక్కు కాల్చుతుండగా ప్రమాదవశాత్తు చెరుకు తోటకు మంటలు అంటుకుని 15 ఎకరాల పంట దగ్ధమైంది. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పినా, సుమారు 20 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని యజమాని బోరున విలపించాడు.