Hardik Pandya: న్యూ ఇయర్ వేళ హార్దిక్ పాండ్యా ఎమోషనల్ పోస్ట్.. తన మాజీ భార్య నటాషాను ఉద్దేశిస్తూ..
2024 సంవత్సరం చివర్లో క్రికెటర్ హార్దిక్ పాండ్యా సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ రాశాడు. దీంతో పాటు ఓ వీడియోను కూడా పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో తన మాజీ భార్య ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు జోడించాడు. దీంతో ఆ వీడియో నెటింట్లో ట్రెండింగ్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకలుగా స్పందిస్తున్నారు.
కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, 2024 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ చాలా మంది సోషల్ మీడియాలో రకరకాల పోస్ట్‌లు పెట్టారు. కొందరు ఫోటోలు, వీడియోలను షేర్ చేసి సంవత్సరపు ప్రత్యేక జ్ఞాపకాలను హైలైట్ చేశారు. సెలబ్రిటీలు కూడా ఇలానే పోస్టులు షేర్ చేశారు. భారత క్రికెట్ జట్టు స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ పోస్ట్‌లో మాజీ భార్య నటాషా స్టాంకోవిక్ పేరును ప్రస్తావించకపోయినా పరోక్షంగా ఆమెను ఉద్దేశించి ఉన్నట్లు అనిపిస్తుంది. పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత హార్దిక్, నటాషా విడాకులు తీసుకున్నారు. వీరిద్దరికీ అగస్త్య అనే కుమారుడు ఉన్నాడు.
హార్దిక్ షేర్ చేసిన వీడియోలో ఓ వాయిస్ వినిపిస్తోంది. “ఒక సంవత్సరం గడిచిపోయినట్లుంది. ” కొన్ని కొత్త విషయాలు, కొత్త బోధనలు, కొత్త అనుభవాలు ఉన్నాయి. కొందరు వెళ్లిపోయారు. కొంతమంది కొత్త వ్యక్తులు వచ్చారు. ఈ సంవత్సరం నాకు చాలా నేర్పింది”, అనే వాయిస్ ఈ వీడియోలో వినబడుతుంది. ఈ వీడియో కింది హార్దిక్ ఇలా క్యాప్షన్ పెట్టాడు. ‘వెనక్కి తిరిగి చూసుకుంటే, నేను గత సంవత్సరం చాలా ఎత్తులు పైఎత్తులు చూశాను. వాటి వల్ల నేను చాలా నేర్చుకున్నాను. నా ప్రయాణంలో భాగమైనందుకు ధన్యవాదాలు. మళ్లీ మిమ్మల్ని కొత్త సంవత్సరంలో కలుస్తాను’ అంటూ పోస్టు షేర్ చేశాడు.
హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం చాలాసార్లు చర్చనీయాంశమైంది. అతని ప్రేమకథ కూడా సినిమా కథకు తగ్గట్టుగానే ఉంటుంది. నటాషాతో అతని మొదటి సమావేశం నైట్ క్లబ్‌లో జరిగింది. ఆ తర్వాత స్నేహితులుగా మారి క్రమంగా ఈ స్నేహం ప్రేమగా మారింది. హార్దిక్ జనవరి 1, 2020న విహారయాత్రలో నటాషాకు ప్రపోజ్ చేశాడు. అప్పటికే నటాషా గర్భవతి.. ఆ తర్వాత జూలై 2020లో ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చింది. కొడుకు పుట్టిన మూడేళ్ల తర్వాత హార్దిక్, నటాషా హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం ఉదయపూర్‌లో పెళ్లి చేసుకున్నారు. అయితే కొద్ది నెలల్లోనే వారిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు.
View this post on Instagram
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి