The Raja Saab: ఫ్యాన్స్ కోసం తప్పట్లేదంటున్న ప్రభాస్
రాజా సాబ్ మొదటి పాటకు నెగిటివ్ రెస్పాన్స్ వచ్చిన తర్వాత, చిత్ర బృందం రెండో పాట "సహానా"పై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభాస్ వింటేజ్ లుక్, నిధి అగర్వాల్ గ్లామర్, అద్భుతమైన విజువల్స్‌తో కూడిన ఈ రొమాంటిక్ పాట అభిమానులను ఆకట్టుకుంది. తమన్ మ్యూజిక్, మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ పాట ఇన్‌స్టంట్ హిట్‌గా నిలిచింది. రాబోయే మాస్ సాంగ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నిజం చెప్పాలంటే రాజా సాబ్ మొదటి పాటకు కాస్త నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది.. ప్రభాస్ రేంజ్ పాట కాదిది.. ఈసారైనా కాస్త చూసుకోవయ్యా తమన్ అంటూ ఫ్యాన్స్ నేరుగానే సోషల్ మీడియాలో సెటైర్లు వేసారు. వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని రెండో పాటను రెడీ చేసారు రాజా సాబ్ టీం. మరి అదెలా ఉంది..? ఈసారి వచ్చిన పాట ఫ్యాన్స్ అంచనాలు అందుకుందా.. విడుదల తేదీ దగ్గరికి వస్తుండటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచేసారు రాజా సాబ్ మేకర్స్. ఈ క్రమంలోనే ఇప్పటికే టీజర్, ట్రైలర్స్ వచ్చేసాయి.. మొన్నే ఓ పాటను విడుదల చేసారు. ఇప్పుడు ఈ సినిమా నుంచి రెండో పాట విడుదలైంది. చాలా రోజుల తర్వాత ప్రభాస్ ఇందులో రొమాంటిక్‌గా దర్శనమిచ్చారు. దాదాపు పుష్కరం తర్వాత డ్యూయెట్ పాడుకున్నారు రెబల్ స్టార్. రాజా సాబ్ నుంచి విడుదలైన మొదటి పాటకు నెగిటివ్ రెస్పాన్స్ వచ్చిందనేది కాదనలేని వాస్తవం.. మిక్సింగ్ బాలేదు.. సౌండింగ్ అంతగా లేదు.. పాట కూడా అంచనాలు అందుకోలేదని విమర్శలొచ్చాయి. అందుకే రెండో పాటపై ఫోకస్ పెంచారు మేకర్స్.. ఈసారి అభిమానులకు కావాల్సింది లెక్కలేసుకుని మరీ ఇచ్చారు మారుతి. పేరు పెట్టలేని విధంగా విజువల్ ఫీస్ట్ ఇచ్చారు.
టైటిల్ సాంగ్‌తో పోలిస్తే తమన్ వర్క్ ఈసారి బెటర్‌గా ఉంది. ముఖ్యంగా పాటలోని విజువల్స్.. ప్రభాస్ వింటేజ్ లుక్, నిధి గ్లామర్ అన్నీ కలిపి సహానా పాటను ఇన్‌స్టంట్ హిట్‌గా నిలబెట్టాయి. ఇందులో ముగ్గురు హీరోయిన్లతో కలిపి ఓ మాస్ సాంగ్ ఉంది. అందులో ప్రభాస్ డాన్సులు పీక్స్‌లో ఉండబోతున్నాయి. అంటే నెక్ట్స్ ఫ్యాన్స్ కోసం బాగానే దాచేసారు మారుతి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మీడియం రేంజ్ హీరోలు కూడా ఇలా చేస్తే ఎలా..?
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ఎన్‌పీఎస్‌లో కీలక మార్పు రూ.8 లక్షలు విత్ డ్రా
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ.. ఎన్ని కోట్ల రూపాయలో తెలుసా..?
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

