చలికాలంలో రోజూ బెల్లం ముక్క తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఇది శరీరానికి వెచ్చదనాన్ని అందించి, శక్తి స్థాయిలను పెంచుతుంది. యాంటీఆక్సిడెంట్ల కారణంగా రోగనిరోధక శక్తిని పెంచి, వ్యాధులు, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. భోజనం తర్వాత బెల్లం తీసుకోవడం ప్రయోజనకరం.