Watch Video: గోవాలో భార్యతో కలిసి ఎంఎస్‌ ధోనీ డ్యాన్స్‌.. వీడియో వైరల్..

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ధొనీ తన కూతురు, భార్యతో కలిసి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్నాడు. ఈ వీడియో వైరల్ కావడంతో ఫ్యాన్స్ ధోనికి న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెబుతూ కామెంట్లు పెడుతున్నారు.

Watch Video: గోవాలో భార్యతో కలిసి ఎంఎస్‌ ధోనీ డ్యాన్స్‌.. వీడియో వైరల్..
Ms Dhoni
Follow us
Velpula Bharath Rao

|

Updated on: Jan 01, 2025 | 9:40 PM

ప్రపంచ వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. అర్ధరాత్రి ప్రజలు 2024కి వీడ్కోలు పలికారు. 2025కి చాలా కోలాహలంగా స్వాగతం పలికారు. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా నూతన సంవత్సర వేడుకల్లో మునిగిపోయాడు. ధోనీ తన కుటుంబంతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, అతను అర్ధరాత్రి న్యూ ఇయర్ వేడుకల్లో మునిగిపోయాడు. అతనితో పాటు అతని కూతురు జివా ధోనీ కూడా వేడుకలో ఉంది. తన భార్య సాక్షి ధోనితో కలిసి డ్యాన్స్ చేస్తూ కనిపించాడు.

మహేంద్ర సింగ్ ధోనీ నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ధోనీ తన కుటుంబంతో కలిసి గోవాలో ఉన్నాడని తెలుస్తుంది. బయటకు వచ్చిన ఆ వీడియోలో ధోని హాట్ ఎయిర్ బెలూన్ ఎగురవేస్తున్నట్లు కనిపించింది. దీన్ని వదిలే సమయంలో ధోనీ కూడా నవ్వుతూ కనిపించాడు. తని కుమార్తె జివా ధోనీ దగ్గర నిలబడి ఉంది.ధోని చుట్టూ చాలా మంది వ్యక్తులు కనిపిస్తున్నారు. 2024కి దుబాయ్‌లో ధోనీ స్వాగతం పలికాడు. న్యూ ఇయర్ సందర్భంగా ధోనీ తన భార్య సాక్షి ధోనీతో కలిసి జోరుగా డ్యాన్స్ చేశాడు. మరో వీడియోలో ధోనీ, సాక్షి ఇతర వ్యక్తులతో కలిసి డ్యాన్స్ చేస్తూ కనిపించింది. సోషల్ మీడియాలో ధోనీకి సంబంధించిన రెండు వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.

ధోని 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైరయ్యాడు. ప్రతి సీజన్ ధోని ఐపీఎల్ ఆడుతున్నాడు. ఈ సారీ 2025లో జరిగే ఐపీఎల్‌లో కూడా ఆడుతాడు. తన కెప్టెన్సీలో ఐదుసార్లు చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐపీఎల్ టైటిల్‌కు నడిపించిన ధోని, ఐపిఎల్ 2024లో 220.54 స్ట్రైక్ రేట్‌తో 161 పరుగులు చేశాడు. ఇప్పటివరకు 264 మ్యాచ్‌లు ఆడిన ధోని సగటు 39.12, స్ట్రైక్ రేట్ 137.53. 229 ఇన్నింగ్స్‌ల్లో 24 హాఫ్ సెంచరీల సాయంతో 5243 పరుగులు చేశాడు.

మరిన్ని క్రికెెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి