ఆ స్టార్ హీరో కాళ్లు కడిగి పెళ్లి చేశా.. కానీ రెండేళ్లు నన్ను దూరం పెట్టాడు: రాజారవీంద్ర
రాజా రవీంద్ర గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది .. నటుడిగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. ఎక్కువగా రాజా రవీంద్ర నెగిటివ్ పాత్రలే చేశారు .. కేవలం నటుడిగానే కాదు స్టార్ హీరోల డేట్స్ కూడా చూస్తూ ఉంటారు .

ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు రాజారవీంద్ర. ఈ సీనియర్ నటుడు ఎక్కువగా నెగిటివ్ రోల్స్ లో కనిపించి ప్రేక్షకులను మెప్పించాడు. కేవలం నటుడిగానే కాదు.. స్టార్ హీరోల డేట్స్ కూడా చూస్తూ ఉంటారు రాజారవీంద్ర. అయితే ఓ స్టార్ హీరో రాజారవీంద్రకు గొడవలు ఉన్నాయని.. ఆ స్టార్ హీరో ఆయనను దూరం పెట్టాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీని పై రాజా రవీంద్ర క్లారిటీ ఇచ్చారు. అయితే మాస్ మహారాజా రవితేజ, రాజా రవీంద్ర మధ్య విభేదాలపై చాలా కాలంగా చక్కర్లు కొడుతున్న వార్తలపై రాజారవీంద్ర స్పష్టత ఇచ్చారు.
సినిమాలు తక్కువే కానీ క్రేజ్ మాత్రం ఫుల్.. మరీ అంత క్యూట్ గా ఉంది ఏంది మావ..!!
గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన దీని పై క్లారిటీ ఇచ్చారు. కెరీర్ ప్రారంభంలో తన అందం, ఎత్తు కారణంగా హీరోలను డామినేట్ చేస్తానంటూ ఎప్పుడూ ఇబ్బందులు పడలేదని ఆయన స్పష్టం చేశారు. నటనకు, ప్రతిభకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుందని, అందం సమస్య కాదని తెలిపారు.ఇక రవితేజతో గొడవల గురించిన ప్రశ్నలకు రాజారవీంద్ర సమాధానమిస్తూ.. తమ మధ్య ఎటువంటి గొడవలు లేవని, ఇప్పటికీ తాము స్నేహితులుగానే ఉన్నామని తెలిపారు. రవితేజ తన చెల్లెలిని వివాహం చేసుకున్నారనే వార్త పూర్తిగా అబద్దమని అన్నారు. రవితేజ పెళ్లి చేసుకుంది తన దగ్గరి బంధువుల అమ్మాయి అని, ఆ పెళ్లికి తానే మధ్యవర్తిగా ఉండి, తన భార్యతో కలిసి కన్యాదానం చేశానని వివరించారు.
ఇండస్ట్రీలో తోప్ హీరోయిన్.. ఎఫైర్స్‌కు కొదవే లేదు.. కట్ చేస్తే 50ఏళ్ల వయసులోనూ సింగిల్
రవితేజ కాళ్లు కడిగి పెళ్లి చేశా.. అప్పటికీ రవితేజ పెద్ద స్టార్ కాదని, మామూలు స్నేహితులుగా తాము ఆ సంబంధాన్ని ఖరారు చేశామని పేర్కొన్నారు రాజా రవీంద్ర. రవితేజతో కొంతకాలంపాటు దూరం పాటించడానికి గల కారణాన్ని వివరిస్తూ.. రవితేజ స్వయంగా రెండేళ్లపాటు తనకు దూరంగా ఉండాలని కోరినట్లు తెలిపారు. తన ప్రమేయం లేకుండా తాను సక్సెస్‌ను సాధించి చూపించాలని రవితేజ అనుకున్నారని, ఇది ఒక స్నేహపూర్వకమైన అంగీకారమే తప్ప గొడవ కాదని రాజారవీంద్ర స్పష్టం చేశారు. తమ కుటుంబాల మధ్య ఇప్పటికీ మంచి అనుబంధం ఉందని, రవితేజ తల్లి తరచుగా తనకు ఫోన్ చేస్తుంటారని, రవితేజ భార్య తమ ఇంటికి వస్తుంటారని.. తమ ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా వారు తప్పకుండా హాజరవుతారని రాజారవీంద్ర వెల్లడించారు. తాను నోటి దూల ఉన్న వ్యక్తిని కావడం వల్ల కొన్నిసార్లు తెలియకుండానే రవితేజను బాధపెట్టి ఉండవచ్చని, అది తన తప్పేనని అంగీకరించారు. అయితే, ఇది ఆర్థికపరమైన విషయాలు గానీ, మరేదో గొడవలు కాదని ఆయన స్పష్టం చేశారు. అలాగే వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవి కూడా తమ గొడవ గురించి రవితేజను అడిగారని, దానికి రవితేజ స్పష్టమైన వివరణ ఇచ్చారని రాజారవీంద్ర తెలిపారు. తమ బంధం ఇప్పటికీ బలమైనదని, రవితేజ అంటే తనకు చాలా ఇష్టమని, అతని నటన అంటే ఇంకా ఇష్టమని అన్నారు. తమ మధ్య దూరాన్ని పెంచడానికి బయటి వ్యక్తుల ప్రమేయం కూడా ఒక కారణం అయి ఉండవచ్చని రాజా రవీంద్ర చెప్పుకొచ్చాడు.
సూపరో సూపర్..! ఒకే ఒక్క సినిమాతో క్రేజ్.. కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ అయేషా ఇలా మారిపోయిందేంటీ..!!
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








