నీకు నేను.. నాకు నువ్వు అని పాడుకుంటున్న రాజమౌళి, కామెరూన్
రాజమౌళి 'వారణాసి' సినిమాను కేవలం పాన్ వరల్డ్ చిత్రంగానే కాకుండా, ప్రమోషన్స్‌లోనూ కొత్త బెంచ్‌మార్క్‌లు సృష్టిస్తున్నారు. జేమ్స్ కామెరూన్‌తో కలిసి అవతార్ 3తో టీజర్‌ను అనుసంధానించడం, విడుదలకు ముందే హాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం వంటివి ఆయన వ్యూహాన్ని తెలియజేస్తున్నాయి. RRR తర్వాత గ్లోబల్ మార్కెట్‌ను పటిష్టం చేయడమే లక్ష్యంగా రాజమౌళి ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నారు.
ప్యాన్ వరల్డ్ సినిమా చేయడం కాదు.. ప్రమోషన్స్ కూడా అలాగే చేసినపుడే కదా మన సత్తా ఏంటో తెలిసేది. రాజమౌళి తాజాగా చేస్తున్నదిదే. వారణాసి సినిమా విషయంలో ఈయన ఫాలో అవుతున్న స్ట్రాటజీ.. వేస్తున్న ప్లాన్.. చేస్తున్న ప్రమోషన్ అన్నీ యూనివర్సల్‌గా ఉన్నాయి. తాజాగా ఆయనకు జేమ్స్ కామెరూన్ కూడా తోడయ్యారు. మరి ఇద్దరూ కలిసి ఏం చేస్తున్నారు..? వరల్డ్ సినిమా అంతా ఇప్పుడు అవతార్ 3 కోసమే వేచి చూస్తుంది. జేమ్స్ కామెరూన్ ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారా అని అంతా ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇలాంటి సమయంలో కెమరూన్ మాత్రం ఓ ఇండియన్ సినిమా గురించి మాట్లాడుతున్నారు.. మరీ ముఖ్యంగా మన తెలుగు సినిమా గురించి.. అదే రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి. చూస్తున్నారుగా.. వారణాసి గురించి జేమ్స్ కామెరూన్ ఏం మాట్లాడుతున్నారో..? ప్రపంచమంతా అవతార్ గురించి మాట్లాడుతుంటే.. అవతార్‌నే సృష్టించిన దర్శకుడు మాత్రం దర్శక ధీరుడి సినిమా గురించి హైప్ ఇస్తున్నారు. వారణాసి మేకింగ్ గురించి స్వయంగా రాజమౌళిని అడిగి తెలుసుకుంటున్నారు జేమ్స్. మరో 8, 9 నెలల్లో షూట్ అయిపోతుందన్నారు జక్కన్న. RRRతో ఓపెన్ అయిన గ్లోబల్ మార్కెట్‌ను వారణాసితో ఫిక్స్ చేయాలని చూస్తున్నారు రాజమౌళి. డే 1 నుంచే ప్లానింగ్ అప్లై చేస్తున్నారు.. అలా టీజర్ విడుదలైందో లేదో.. అప్పుడే హాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్. ఇంటర్నేషనల్‌గా ఈ సినిమాకు బజ్ పెంచడానికి రిలీజ్‌కు ఏడాదిన్నర ముందే ప్రమోషన్ మొదలుపెట్టారు రాజమౌళి. తాజాగా తన ప్రమోషనల్ స్ట్రాటజీలో భాగంగా జేమ్స్ కామెరూన్‌తో మాట్లాడారు. వారణాసి టీజర్‌ను అవతార్ 3 సినిమాతో జత చేయబోతున్నారు. అవతార్‌తో ఈ టీజర్ యాడ్ అయిందంటే ప్రమోషన్ టాప్ గేర్‌లోకి వెళ్లిపోతుంది. మామూలుగా తన చిత్ర ప్రమోషన్స్ చివర్లో ప్లాన్ చేసుకునే రాజమౌళి.. వారణాసి కోసం ముందే ప్లాన్ చేసారు. 2027 సమ్మర్‌లో సినిమా విడుదల కానుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ఎన్‌పీఎస్‌లో కీలక మార్పు రూ.8 లక్షలు విత్ డ్రా
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ.. ఎన్ని కోట్ల రూపాయలో తెలుసా..?
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

