పశ్చిమ బెంగాల్ పూరులియా జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామమైన జిలింగ్ సెరెన్ నుండి వచ్చిన మాలతి ముర్ము, గత ఐదేళ్లుగా వంద మందికి పైగా పిల్లలకు ఉచితంగా విద్యను అందిస్తోంది. స్కూల్ దూరంగా ఉండటం, కోవిడ్ కారణంగా పాఠశాలలు మూతపడటంతో పిల్లలకు విద్యను దూరం కాకుండా తన ఇంట్లోనే ట్యూషన్ సెంటర్ ఏర్పాటు చేసి, వారి భవిష్యత్తుకు బాటలు వేస్తోంది.