Ujjwal Kasthala: ప్రవాస భారతీయుడికి అరుదైన గౌరవం.. సాంస్కృతిక కళల అధికార సభ్యుడిగా ఉజ్వల్ కాస్థల నియామకం..
ఎడిసన్ సిటీ సాంస్కృతిక కళల అధికార సభ్యుడిగా ఉజ్వల్ కాస్థలను నియమితులయ్యారు. గత పదేళ్లుగా ఆయన ఎడిసన్‌లో నివసిస్తూ ప్రవాస భారతీయ సంఘాల..
ప్రవాస భారతీయుడికి మరొకరికి అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలో భారత ఎన్నారైలు ఎక్కువగా నివసించే న్యూజెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్ సిటీ సాంస్కృతిక కళల అధికార సభ్యుడిగా ఉజ్వల్ కాస్థలను నియమితులయ్యారు. గత పదేళ్లుగా ఆయన ఎడిసన్‌లో నివసిస్తూ ప్రవాస భారతీయ సంఘాల సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహహణలో కీలకపాత్ర పోషిస్తున్నారు. గత ఏడేళ్లుగా ఆయన టీవీ9 ప్రతినిధిగానూ పనిచేస్తున్నారు. న్యూజెర్సీ స్టేట్‌లో ఐదో పెద్దనగరంగా ఉన్న ఎడిసన్ సిటీ జనాభా లక్షకు పైగా ఉంటే.. వారిలో 30 శాతం మంది భారత సంతతి వారే. లిటిల్ ఇండియాగా పిలిచే ఓక్ ట్రీ రోడ్డు ఎడిసన్ నగరంలోనే ఉంటుంది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన కళాకారులను ప్రదర్శించే వివిధ భారతీయ సాంస్కృతిక కార్యక్రమాలకు ఎడిసన్ సైనోసర్‌గా మారడంలో ఆశ్చర్యం లేదు. 2022 జనవరిలో జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా భారత సంతతికి చెందిన సామ్ జోషి మేయర్‌గా ఎన్నికయ్యారు.
మరిన్న అంతర్జాతీయ వార్తల కోసం