UK PM Results: బ్రిటన్ ప్రధాని ఎవరో తేలేది నేడే.. ఫలితాలకు ముందు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రిషి సునాక్..

ప్రపంచ దేశాల్లో ఒక్కటైన బ్రిటన్‌ ప్రెసిడెంట్‌ ఎలక్షన్లలో హోరాహోరీ పోరు సాగుతోంది. నేడు వెలువడే ఫైనల్‌ రిజల్ట్స్‌పై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ కీలక సమయంలో రిషి సునాక్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

UK PM Results: బ్రిటన్ ప్రధాని ఎవరో తేలేది నేడే.. ఫలితాలకు ముందు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రిషి సునాక్..
Rishi Sunak Liz Truss
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 05, 2022 | 7:12 AM

UK PM Results: బ్రిటన్‌ పోరు ఫైనల్‌కు చేరింది. రసవత్తరంగా సాగుతున్న ప్రచార పర్వం హోరా హోరీగా సాగుతోంది. నువ్వా.. నేనా అన్నట్టుగా నడుస్తున్న క్యాంపెయిన్‌ ఉత్కంఠ రేపుతోంది. రిషి సునాక్‌ వర్సెస్‌ లిజ్‌ ట్రస్‌ మధ్య నడుస్తున్న ఈ పోరు వైపు ప్రపంచం మొత్తం ఎదురు చేస్తోంది. ఇదే సందర్భంలో ఓ కీలక వ్యాఖ్య చేశారు రిషి సునాక్‌.

ప్రపంచ దేశాల్లో ఒక్కటైన బ్రిటన్‌ ప్రెసిడెంట్‌ ఎలక్షన్లలో హోరాహోరీ పోరు సాగుతోంది. నేడు వెలువడే ఫైనల్‌ రిజల్ట్స్‌పై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ కీలక సమయంలో రిషి సునాక్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ తాను ఈ పోటీలో ఓడిపోతే.. తదుపరి ప్రభుత్వానికి మద్దతు కొనసాగిస్తానని ప్రకటించారు. ఎన్నికల ఫలితాల వెల్లడికి కొన్ని గంటల ముందు ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. లిజ్‌ ట్రస్‌ చేతిలో ఓడిపోతే.. ఎంపీగా కొనసాగుతూ, తన నియోజకవర్గం కోసం పనిచేస్తానని చెప్పారు.

ఎన్నికల్లో ఓడి పోయినా.. పార్లమెంట్‌ సభ్యుడిగా కొనసాగుతానని స్పష్టం చేశారు. ఉత్తర యార్క్‌షైర్‌లోని రిచ్‌మండ్‌కు ప్రాతినిధ్యం వహించడం గొప్పగా భావిస్తున్నానని చెప్పుకొచ్చారు. ప్రజల మద్దతు ఉన్నంతకాలం వారికి అందుబాటులోనే ఉంటానని.. కన్జర్వేటివ్‌ ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. అయితే, తదుపరి కార్యాచరణ ఏంటి? అన్న ప్రశ్నకు రిషి సునాక్‌ సమాధానమిచ్చారు. టోరీ లీడర్‌ ఎన్నికల్లో.. ప్రతికూల ఫలితం ఎదురు కానుందని సర్వేలు చెబుతోన్న నేపథ్యంలో రిషి సునాక్‌ కూడా అటువంటి సంకేతాలిస్తూ మాట్లాడారు.

ఇవి కూడా చదవండి

ప్రధాని పదవి రేసులో భాగంగా రిషి సునాక్‌, లిజ్‌ ట్రస్‌ మధ్య తీవ్ర పోటీ ఉన్నప్పటికీ.. టోరీ ఓటర్లు మాత్రం ట్రస్‌ వైపే మొగ్గు చూపినట్లు సర్వేలు అంచనా వేశాయి. దాదాపు 1.60 లక్షల మంది నమోదిత టోరీ సభ్యులు ఆన్‌లైన్‌, పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బ్రిటన్‌ కాలమానం ప్రకారం ఇవాళ మధ్యాహ్నం ఫైనల్‌ ఫలితం వెలువడనుంది.

స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఓటింగ్ జరిగింది. లక్షా 60వేల మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకోన్నారు. బ్రిటన్‌లోని భారతీయులంతా సునాక్‌కు మద్దతు ఇస్తున్నారు. ఆయనకు అనుకూలంగా ఇప్పటికే ఓటేశారు. అంతేకాదు, రిషి గెలుపును కాంక్షిస్తూ పూజలు, హోమాలు కూడా నిర్వహిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..