Health Tips: బాదం, మిరియాలు కలిపి తీసుకుంటే నమ్మలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు.. అవేంటో తెలుసుకోండి..
బాదం, మిరియాలు కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కలిగే లాభాల గురించి చాలా మందికి తెలియదు?.. అందుకే వీటి గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Health Tips
Black Pepper And Almonds Benefits: సాధారణంగా మనమందరం బాదం, నల్ల మిరియాలను పలు సందర్భాల్లో వేర్వేరుగా తీసుకుంటాము. అయితే.. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. అదే సమయంలో బాదం, మిరియాలు కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కలిగే లాభాల గురించి చాలా మందికి తెలియదు?.. అందుకే వీటి గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నల్ల మిరియాలు, బాదం ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
బాదం, నల్ల మిరియాలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..
ఇవి కూడా చదవండి

Strawberry: స్ట్రాబెర్రీలతో బోలెడన్ని లాభాలు.. రెగ్యులర్‌గా తింటే క్యాన్సర్ సహా ఆ జబ్బులకు చెక్ పెట్టొచ్చు..

Crime: దారుణం.. కూతురు కంటే ఎక్కువ మార్కులొచ్చాయని ఘాతుకం.. స్కూల్ టాపర్‌ను చంపిన తల్లి..

Fig For Health: అంజీర్ పండుతో ఆ సమస్యలన్నింటికీ చెక్.. ఎప్పుడు, ఎన్ని తింటే మంచిదో తెలుసుకోండి..

Watch Video: ప్రశ్నించిన మహిళతో బీజేపీ ఎమ్మెల్యే దురుసు ప్రవర్తన.. పేపర్లు చింపి, అరెస్టు చేయాలంటూ ఆదేశం.. వీడియో వైరల్..
- ఉదర సమస్యలు దూరం: బాదంలో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది ఉదరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతోపాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే, నల్ల మిరియాలు ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడంలో, వాటిని సులభంగా జీర్ణం చేయడంలో సహాయపడే పైపెరిన్ అనే సమ్మేళనాలను కలిగి ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో అలాగే ప్రేగులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అందువల్ల మీరు దీన్ని ప్రతిరోజూ తీసుకుంటే కడుపుకు మేలు చేస్తుంది.
- మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి: బాదంపప్పు మెదడుకు పదును పెడుతుంది. కావున దీనిని బ్రెయిన్ ఫుడ్ అని కూడా పేర్కొంటారు. అదే సమయంలో మిరియాలలో ఉండే పైపెరిన్ ఆందోళన, ఒత్తిడిని తగ్గించడానికి కూడా పని చేస్తుంది.అంతే కాదు మీరు దీన్ని రోజూ తీసుకుంటే, మీ మెదడును ఉత్తేజితం అవుతుంది.
- రక్తపోటును నియంత్రిస్తాయి: బాదం, నల్ల మిరియాలు అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతాయి. ఇది శరీరం నుంచి చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తాయి. దీని వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
- జలుబు – దగ్గుకు దివ్యౌషధం: బాదం, నల్ల మిరియాలు తీసుకోవడం జలుబు దగ్గు సమస్యలో మేలు చేస్తుంది. ఇది శ్లేష్మం, దాని అధిక ఉత్పత్తిని నియంత్రించడంలో సహాయపడుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం..