Nassar: ’14 రోజులు కోమాలోనే కుమారుడు.. కోలుకోగానే ఆ స్టార్ హీరో పేరే తలిచాడు’.. నాజర్ ఎమోషనల్

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ గర్వించదగ్గ గొప్ప నటుల్లో నాజర్ కూడా ఒకరు. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఆయనకు మంచి గుర్తింపు ఉంది. సుమారు మూడు దశాబ్దాలుగా సినీ కళామతల్లికి సేవలందిస్తున్నారీ సీనియర్ నటుడు. అయితే నాజర్ జీవితంలో ఒక విషాదం చోటు చేసుకుంది.

Nassar: '14 రోజులు కోమాలోనే కుమారుడు.. కోలుకోగానే ఆ స్టార్ హీరో పేరే తలిచాడు'.. నాజర్ ఎమోషనల్
Nassar Family
Follow us
Basha Shek

|

Updated on: Jan 01, 2025 | 7:17 PM

2014లో సీనియర్ నటుడు నాజర్ కుమారుడు ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.సుమారు రెండు వారాల పాటు కోమాలోనే ఉన్నాడు. అయితే స్పృలోకి రాగానే కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ పేరు తలచాడట. ఈ విషయాన్ని నాజర్ ఇటీవల చెప్పుకొచ్చారు. దళపతి విజయ్‌కి భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. తమిళనాడులోనే కాకుండా కన్నడ, తెలుగు, మలయాళ భాషల్లోనూ ఈ హీరోకు ఫ్యాన్స్ ఉన్నారు. అందులో నాసర్ కుమారుడు నూరుల్ హసన్ ఫైజల్ కూడా ఉన్నాడు. ఈ విషయాన్ని నాజర్ బయటపెట్టారు. సినిమాలతో బిజీగా ఉండే ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ‘కొన్నేళ్ల క్రితం నా కొడుకు ఘోర ప్రమాదానికి గురయ్యాడు. 14 రోజుల పాటు కోమాలో ఉన్నాడు. లేచి చూసేసరికి నాన్నగానీ, అమ్మగానీ చెప్పలేదు. హీరో విజయ్ పేరు తలచాడు. విచిత్రమేమిటంటే నా కుమారుడి స్నేహితుడి పేరు కూడా విజయ్ కుమార్. అతను కూడా ప్రమాదంలో గాయ పడ్డాడు. విజయ్ పేరు గుర్తుకు తెచ్చుకోవడంతో కుటుంబ సభ్యులందరూ సంతోషం వ్యక్తం చేశారు. కానీ అది నిజం కాదని త్వరగానే తెలిసిపోయింది. విజయ్‌ కుమార్‌ను తీసుకొచ్చినప్పుడు అతడిని గుర్తుపట్టలేకపోయాడు. ఇతడెవరన్నట్లు చూశాడు. దీంతో మా కుటుంబంలో కలవరం నెలకొంది.

‘నా భార్య ఒక సైకాలజిస్ట్‌. ఆ తర్వాత నా కొడుకు మాట్లాడుతున్నది నటుడు దళపతి విజయ్ గురించి అని తెలిసింది. ఆ తర్వాత అతను కోలుకునేంతవరకు విజయ్ సినిమాలు, పాటలను చూపించడం మొదలుపెట్టాం. ఇక్కడ విశేషమేమిటంటే నా కొడుకు కోలుకోవడానికి దళపతి విజయ్ కూడా చాలా సహకరించాడు. ఫైజల్ విజయం తెలుసుకుని పలు సార్లు ఆసుపత్రికి వెచ్చాడు. ‘నాకు, ఫైసల్‌ కు విజయ్‌ చాలా ముఖ్యమైన వ్యక్తిగా మారారు’ అని నాజర్‌ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ సీనియర్ నటుడి వ్యాఖ్యలు వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

నాజర్ కుమారుడితో దళపతి విజయ్..

ఇక సినిమా విషయానికి వస్తే విజయ్ నటించిన ‘ది గోట్’ చిత్రం ఇటీవల విడుదలై విజయం సాధించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉంటోన్న విజయ్ దళపతి 69 (వర్కింగ్ టైటిల్) సినిమాలో నటిస్తున్నాడు. ఇదే ఆయనకు ఆఖరు సినిమా అని తెలుస్తోంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి