Tollywood: మహేశ్, నానిలతో సినిమాలు.. ఇప్పుడు రాజకీయాల్లో బిజి.. ఈ తెలుగు హీరోయిన్‌ను గుర్తు పట్టారా?

హీరోలతో పోల్చుకుంటే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువగా ఉంటుంది. వరుసగా 2-3 ఫ్లాపులు పడితే కనుమరుగైపోతారు. ఈ టాలీవుడ్ హీరోయిన్ కూడా సరిగ్గి ఇదే కోవకు చెందుతుంది. కెరీర్ ప్రారంభంలో వరుసగా రెండు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది... కానీ..

Tollywood: మహేశ్, నానిలతో సినిమాలు.. ఇప్పుడు రాజకీయాల్లో బిజి.. ఈ తెలుగు హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
Tollywood Actress
Follow us
Basha Shek

|

Updated on: Jan 01, 2025 | 5:47 PM

పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఈ అమ్మాయి ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. కెరీర్ ప్రారంభంలోనే మహేశ్ బాబు, నాని వంటి స్టార్ హీరోలతో స్క్రీన్‌ షేర్ చేసుకుంది. హీరోయిన గా వరుసగా రెండు హిట్స్ కూడా అందుకుంది. అందం, అభినయం పరంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఆ తర్వాతే దురదృష్టం వెంటాడింది. చాలా సినిమాలు చేసినా విజయం దక్కలేదు. తెలుగుతో పాటు తమిళ్ లో సినిమాలు చేసినా సక్సెస్ మాత్రం రాలేదు. దీంతో రాజకీయాల్లోకి అడుగు పెట్టింది. బీజేపీ పార్టీలో చేరి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేసింది. కానీ అక్కడ కూడా పరాజయం ఎదురైంది. ప్రస్తుతానికి సినిమాలకు దూరంగా ఉన్న ఈ అందాల తార తన సంచలన కామెంట్స్ తో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. రాజకీయాల పరంగానే కాకుండా సామాజి అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తుంటుందీ ముద్దుగుమ్మ. ఇటీవల అల్లు అర్జున్ పై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసి న్యూస్ లో నిలిచిన ఈ సొగసరి మరెవరో కాదు మాధవీ లత. ఇవి ఆమె టీనేజ్ నాటి ఫొటోలు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మాధవీలత తాజాగా ఒక పోస్ట్ ను షేర్ చేసుకుంది. తన కాలేజీ ఐడీ కార్డును అందులో షేర్ చేసింది. కర్ణాటకలోని బళ్లారిలో వుంకి సన్నరుద్రప్ప (వీఎస్సార్) లా కాలేజీలో విద్యాభ్యాసం చేసినప్పటి ఐడీ కార్డు అది. ఈ ఐడీ కార్డును మాధవీలత స్వయంగా సోషల్ మీడియాలో పంచుకుంది. తవ్వకాల్లో బయటపడిందంటూ ఆమె చమత్కరించింది. బళ్లారిలోని వీఎస్సార్ కాలేజిలో ఎల్ఎల్ బీ చదివానని, ఇలాంటివి చూస్తుంటే అబ్బో జీవితంలో మనం చాలా చేశాం అనిపిస్తుంటుందని మాధవీలత పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

మాధవీలత లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మహేశ్ బాబు నటించిన అతిథి సినిమాలో ఓ చిన్న పాత్రతో వెండితెరకు పరిచయమైంది మాధవీలత. ఆతర్వాత నచ్చావులే, స్నేహితుడా వంటి హిట్ సినిమాల్లో నటించింది. కానీ ఆతర్వాత వరుసగా పరాజయాలే ఎదురవ్వడంతో రాజకీయాల్లోకి అడుగు పెట్టింది.

బీజేపీ నాయకురాలిగా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం