Bollywood: ‘బాలీవుడ్‌పై అసహ్యమేస్తోంది..ఇక సౌత్‌లోనే సినిమాలు చేస్తా’.. స్టార్ నటుడి సంచలన నిర్ణయం

గతంలో ఓ వెలుగు వెలిగిన బాలీవుడ్‌ ప్రతిభ క్రమంగా మసకబారుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అక్కడ కంటెంట్ కు పెద్దగా ప్రాధాన్యమివ్వరన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగా కొంత మంది బాలీవుడ్‌ ఫిల్మ్ మేకర్లు, యాక్టర్లు క్రమంగా సౌత్ లోనే స్థిరపడిపోతున్నాడు. తాజాగా మరొక స్టార్ డైరెక్టర్ కమ్ ట్యాలెంటెడ్ యాక్టర్ కూడా ఇదే నిర్ణయం తీసుకున్నాడు.

Bollywood: 'బాలీవుడ్‌పై అసహ్యమేస్తోంది..ఇక సౌత్‌లోనే సినిమాలు చేస్తా'.. స్టార్ నటుడి సంచలన నిర్ణయం
Anurag Kashyap
Follow us
Basha Shek

|

Updated on: Jan 01, 2025 | 7:47 PM

బాలీవుడ్‌లో ప్రాఫిట్ ఓరియెంటెడ్ ఫిల్మ్ మేకింగ్‌తో విసిగిపోయానంటున్నాడు ప్రముఖ డైరెక్టర్ కమ్ ట్యాలెంటెడ్ యాక్టర్. బాలీవుడ్‌లో ప్రయోగాత్మక చిత్రాల నిర్మాణానికి అవకాశం తక్కువని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే సౌత్ ఇండియాకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించాడు. ఈ నిర్ణయాన్ని 2025లో అమలు చేయాలని ఆయన భావిస్తున్నారు. ఆయన మరెవరో కాదు విజయ్ సేతుపతి మహారాజా సినిమాలో విలన్ గా క్రూరత్వం పండించిన అనురాగ్ కశ్యప్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ‘బాలీవుడ్‌లో నిర్మాతలు లాభాలను మాత్రమే ఆశించే కండిషన్లు చూస్తుంటే బాధగా ఉంది. అందుకే దక్షిణ భారతదేశానికి వచ్చి ప్రయోగాలు చేయాలని నిర్ణయించుకున్నాను. ‘ఇప్పుడు బాలీవుడ్ లో ప్రయోగాత్మక చిత్రాలు చేయలేను. ఎందుకంటే ఇక్కడి నిర్మాతలు లాభం గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటారు. సినిమా నిర్మాణంలో ఉన్న ఆనందం ఇప్పుడు లేదు. అందుకే 2025లో ముంబై వదిలి సౌత్ ఇండియా వెళ్తున్నాను’ అని చెప్పుకొచ్చాడు అనురాగ్.

‘నాకు ఎక్కడ ఆనందం ఉంటుందో అక్కడే ఉండాలనుకుంటున్నాను. లేకుంటే నేను ముసలివాడిగానే చనిపోతాను. నా పరిశ్రమ పట్ల నాకు చాలా నిరాశ, అసహ్యం ఉంది. ఇక్కడి వైఖరి చూసి అసహ్యం వేస్తోంది’ అని బాలీవుడ్ పై విమర్శల వర్షం కురిపించాడు అనురాగ్ కశ్యప్. కాగా ‘మంజుమ్మేల్ బాయ్స్’ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు బాలీవుడ్ ఆసక్తి కనబరుస్తోంది. దీనిపై అనురాగ్ కశ్యప్‌ స్పందించాడు. ఇప్పటికే విడుదలైన సినిమాలను రీమేక్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొత్తగా చేయాలనే ఆసక్తి చూపడం లేదు’ అని అనురాగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఇవి కూడా చదవండి

అనురాగ్ కశ్యప్ పోస్ట్..

అనురాగ్ కశ్యప్ కు బాలీవుడ్ లో మంచి గుర్తింపు ఉంది. గ్యాండ్ ఆఫ్ వస్సేపూర్ లాంటి సూపర్ హిట్ సినిమాలకు ఆయన తెరకెక్కించాడు. నిర్మాతగానూ అభిరుచి చాటుకున్నాడు. అయితే ఈమధ్యన తన నటనతోనే అందరినీ అలరిస్తున్నాడు. విజయ్ దళపతి లియో సినిమాలో మెరిసిన అనురాగ్ మహారాజా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల విడుదలైన విడుదలై పార్ట్ 2లోనూ ఓ పాత్రలో తళుక్కుమన్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్.

విజయ్ సేతుపతి మహారాజా సినిమాలో అనురాగ్ కశ్యప్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి