AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sankranti Movies: నయా ప్రమోషన్‌ ట్రెండ్‌… కొత్త సినిమాలకు కొత్త ప్లాన్స్‌

ఈ సంక్రాంతికి టాలీవుడ్ నుంచి మూడు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇందులో రాంచరణ్ గేమ్ చేంజర్, బలయ్య మూవీ డాకూ మహరాజ్, వెంకటేష్ సినిమా సంక్రాంతి వస్తున్నాం బరిలో ఉన్నాయి. ఈ మూడు సినిమాలు మూడు డిఫరెంట్ జానర్లు, మూడు సినిమాల్లోనూ డిఫరెంట్ ఇమేజ్‌ ఉన్న ముగ్గురు హీరోలు నటించారు. అయితే ఈ మూడు సినిమాల ప్రమోషన్ స్ట్రాటజీస్‌ కూడా డిఫరెంట్‌ గానే ఉన్నాయి.

Sankranti Movies: నయా ప్రమోషన్‌ ట్రెండ్‌... కొత్త సినిమాలకు కొత్త ప్లాన్స్‌
Sankranthi Movies 2025
Satish Reddy Jadda
| Edited By: |

Updated on: Jan 01, 2025 | 7:58 PM

Share

ఒకప్పుడు సినిమా ప్రమోషన్ అంటే పోస్టర్లు, అడ్వర్‌టైజ్మెంట్స్‌ లు ఉండేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. సినిమా ప్రమోషన్‌ కొత్త పుంతలు తొక్కుతోంది. సోషల్ మీడియా రాకతో డిజిటల్ ప్రమోషన్‌ లో కొత్త ట్రెండ్స్‌ కనిపిస్తున్నాయి. ఇవి చాలదన్నట్టు ప్రజెంట్‌ ప్రమోషన్ కు రియాలిటీ షోస్‌ను కూడా వాడేస్తున్నారు మేకర్స్. ముఖ్యంగా భారీ బడ్జెట్‌ సినిమాల విషయంలో ఈ ప్రమోషన్‌ ట్రెండ్ బాగా వర్కవుట్ అవుతోంది.

ఈ సంక్రాంతికి టాలీవుడ్ నుంచి మూడు సినిమాలు (గేమ్ చేంజర్, డాకూ మహరాజ్, సంక్రాంతి వస్తున్నాం)  బరిలో దిగుతున్నాయి. ఈ మూడు సినిమాలు మూడు డిఫరెంట్ జానర్లు, మూడు సినిమాల్లోనూ డిఫరెంట్ ఇమేజ్‌ ఉన్న ముగ్గురు హీరోలు నటించారు. అయితే ఈ మూడు సినిమాల ప్రమోషన్ స్ట్రాటజీస్‌ కూడా డిఫరెంట్‌ గానే ఉన్నాయి. కానీ ఒక్క విషయంలో మాత్రం మూడు సినిమాలు ఒకే ఫార్ములాను రిపీట్ చేశాయి. అదే రియాలిటీ షో ప్రమోషన్‌. ఈ మూడు సినిమాల యూనిట్స్‌ తమ మూవీని ఆహా అన్‌స్టాపబుల్ షోలో ప్రమోట్ చేశాయి.

తాజాగా గ్లోబల్ స్టార్‌ రామ్ చరణ్ అన్‌ స్టాపబుల్‌ షో షూటింగ్‌ లో పాల్గొన్నారు. గేమ్ చేంజర్‌ రిలీజ్ సందర్భంగా తన షోకు వచ్చిన చెర్రీకి ఘన స్వాగతం పలికారు బాలయ్య. మన ఇద్దరి సినిమాలు సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా అన్నారు బాలయ్య. ఈ వారం బాలయ్య హీరోగా తెరకెక్కిన డాకూ మహరాజ్‌ టీమ్‌ ఈ షోలో సందడి చేయనుంది. దర్శక నిర్మాతలో షూట్ చేసిన ఎపిసోడ్‌ కు సంబంధించిన ప్రోమో ఆల్రెడీ యూట్యూబ్‌ లో టాప్‌ లో ట్రెండ్ అవుతోంది. ఫుల్ ఎపిసోడ్‌ జనవరి 3 సాయంత్రం 7 గంటలకు ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంక్రాంతి బరిలో దిగుతున్న మరో ఇంట్రస్టింగ్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమాతో టీమ్ ఆల్రెడీ అన్‌ స్టాపబుల్‌ ఎపిసోడ్‌ లో సందడి చేసింది. గత వారం స్ట్రీమ్ అయిన ఎపిసోడ్‌ లో బాలయ్య, వెంకీ సందడి అందరినీ ఆకట్టుకుంది. రీసెంట్ టైమ్స్‌ లో బిగ్‌ బాస్‌ లోనూ రిలీజ్ మూవీస్‌ టీమ్‌ సందడి చేసిన సందర్బాలు చాలానే ఉన్నాయి. సౌత్‌ లో మాత్రమే కాదు నార్త్‌ లోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది.

ట్రిపులార్ రిలీజ్ టైమ్‌ లో దాదాపు అన్ని నార్త్ రియాలిటీ షోస్‌ లో తమ సినిమాను ప్రమోట్ చేశారు తారక్, చరణ్‌. బాలీవుడ్‌ బిగ్ బాస్‌, ది కపిల్‌ శర్మ షో లాంటి కార్యక్రమాల్లో సినిమా ప్రమోషన్స్ రెగ్యులర్‌ గా కనిపిస్తున్నాయి. అలా ప్రమోట్ చేసిన సినిమాల రిజల్ట్స్‌ కూడా పాజిటివ్‌ గానే కనిపిస్తున్నాయి.