AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohan Lal: సీనియర్ నటులు యంగ్ బ్యూటీస్‌తో జోడీ కడితే తప్పేంటి?

సినీ ఇండస్ట్రీలో 50, 60 దాటిన హీరోలు కూడా యాక్షన్ రొమాంటిక్ రోల్స్‌ లో కనిపించటం అన్నది కామన్‌ 20, 30లలోని యంగ్ బ్యూటీస్‌తో ఆడిపాడుతున్నారు. ఈ ట్రెండ్ ఒక్క టాలీవుడ్‌కే పరిమితం కాలేదు. ఇటు సౌత్, అటు నార్త్‌లోని అన్ని మూవీ ఇండస్ట్రీస్‌లో ఉన్నదే. అయితే ఈ ట్రెండ్ మీద ఎన్ని విమర్శలు వచ్చినా... హీరోల ఇమేజ్‌, కథ డిమాండ్‌ ను బట్టి, స్టార్ హీరోతో సినిమా అంటే గ్లామరస్ హీరోయిన్‌ ఉండాల్సిందే అన్న ఫార్ములాను ఇంకా ఫాలో అవుతున్నారు

Mohan Lal: సీనియర్ నటులు యంగ్ బ్యూటీస్‌తో జోడీ కడితే తప్పేంటి?
Mohan Lal
Satish Reddy Jadda
| Edited By: |

Updated on: Jan 01, 2025 | 8:11 PM

Share

మన ఇండస్ట్రీలో 50, 60 దాటిన సీనియర్ నటులు కూడా యాక్షన్ రొమాంటిక్ రోల్స్‌ లో కనిపించటం అన్నది కామన్‌. హీరో ఎవరైనా వాళ్ల సినిమాల్లో గ్లామర్స్ క్యూట్ బ్యూటీస్ హీరోయిన్స్‌ గా కనిపంచటం అన్నది కూడా కామనే. అయితే ఈ ట్రెండ్ మీద ఎన్ని విమర్శలు వచ్చినా… హీరోల ఇమేజ్‌, కథ డిమాండ్‌ ను బట్టి, స్టార్ హీరోతో సినిమా అంటే గ్లామరస్ హీరోయిన్‌ ఉండాల్సిందే అన్న ఫార్ములాను ఇంకా ఫాలో అవుతున్నారు. తాజాగా ఈ ట్రెండ్‌ గురించి మాట్లాడారు మాలీవుడ్ సీనియర్ స్టార్ మోహన్‌లాల్‌.

సీనియర్ హీరోలు యంగ్ హీరోయిన్స్‌ తో కలిసి నటిస్తే తప్పేంటంటున్నారు ఈ సీనియర్ హీరో. జనాలు చూస్తున్నారు… అలాంటి సినిమాలు సక్సెస్ అవుతున్నాయి. అందుకే మేకర్స్‌ కూడా ఆ ట్రెండ్‌ ను కంటిన్యే చేస్తున్నారని చెప్పారు. అంతేకాదు తెర మీద పాత్ర ఏదైతే, నటీనటులు అలా కనిపిస్తారు. అంతేగానీ తెర వెనుక వాళ్ల వయసుతో ఆ పాత్రకు సంబంధం ఏంటన్నది మోహన్‌లాల్ వాదన. మాలీవుడ్‌ లో సూపర్ స్టార్‌ గా ఉన్న మోహన్‌లాల్‌, ఎక్కువగా వయసుకు తగ్గ పాత్రలే చేస్తున్న, అప్పుడప్పుడు రొమాంటిక్ రోల్స్‌ లోనూ షాక్ ఇస్తున్నారు.

అయితే ఈ విషయం గురించి టాలీవుడ్ సర్కిల్స్‌ లోనూ చాలా కాలంగా చర్చ జరుగుతోంది. సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌, నాగార్జున… కొత్తగా ట్రై చేస్తున్నా… తమ సినిమాల్లో రొమాంటిక్ యాంగిల్ మాత్రం మిస్ అవ్వకుండా చూసుకుంటున్నారు. అందుకోసం కంపల్సరీ గా ఓ లవ్‌ ట్రాక్‌ పెట్టక తప్పటం లేదు. అందుకోసం యంగ్ బ్యూటీస్‌ ను కాస్ట్ చేయకా తప్పటం లేదు. అయితే వీలైనంత వరకు సీనియర్ బ్యూటీస్‌ నే హీరోయిన్‌ గా ట్రై చేస్తున్నా.. డేట్స్ అడ్జస్ట్‌మెంట్‌ తో పాటు సీనియర్ హీరోయిన్లు కూడా లేడీ ఓరియంటెడ్ సినిమాల మీద ఇంట్రస్ట్ చూపిస్తుండటంతో సీనియర్ హీరోలు యంగ్ బ్యూటీస్‌ తో జోడీ కట్టక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.

సౌత్‌ ఇండస్ట్రీలో త్రిషా, నయనతార, మంజు వారియర్‌, కాజల్‌ ఇలా వేళ్ల మీద లెక్క బెట్టగలిగే అంత మంది మాత్రమే సీనియర్ హీరోలకు జోడీగా సెట్ అయ్యే బ్యూటీస్‌ ఉన్నారు. వీళ్లంతా వెబ్‌ సిరీస్‌ లు, లేడీ ఓరియంటెడ్ సినిమాలతో బిజీగానే ఉంటున్నారు. అందుకే సీనియర్ హీరోలు తమ సినిమాల కోసం యంగ్ బ్యూటీస్ వైపు చూస్తున్నారు. ఏది ఏమైనా ఆడియన్స్ ఆదరించినంత వరకు సీనియర్లు జూనియర్ల తో జోడీ కట్టడం అంత పెద్ద విషయమేం కాదన్న మోహన్‌లాల్ మాటకే ఎక్కువ మంది సినీ జనాలు మద్దతిస్తున్నారు.

నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?