Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UK PM Election Results: బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్.. 20,000 ఓట్ల తేడాతో రిషి సునక్‌పై గెలుపు..

Britain New PM: బ్రిటన్ ప్రధాని ఎన్నికలో లిజ్ ట్రస్ విజయం సాధించారు. భారత సంతతికి చెందిన ఎంపీ రిషి సునక్‌పై ట్రస్ ఘన విజయాన్ని అందుకున్నారు.

UK PM Election Results: బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్.. 20,000 ఓట్ల తేడాతో రిషి సునక్‌పై గెలుపు..
Uk Pm
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 05, 2022 | 6:25 PM

బ్రిటన్ ప్రధాని పదవికి జరిగిన ఎన్నికల్లో లిజ్ ట్రస్ విజయం సాధించారు. ఆమెకు గట్టి పోటీ ఇచ్చారు భారత సంతతికి చెందిన ఎంపీ రిషి సునక్‌. లిజ్ ట్రస్ మంగళవారం ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. థెరిసా మే, మార్గరెట్ థాచర్ తర్వాత లిజ్ ట్రస్ బ్రిటన్ మూడవ మహిళా ప్రధాన మంత్రి అయ్యారు. ప్రధానమంత్రి ఎన్నికకు సంబంధించిన ఆకరి అంకం ఓటింగ్ శుక్రవారం ముగిసింది. ఎన్నికల ఫలితాలకు ముందు వచ్చిన ప్రీ-పోల్ సర్వేలో రిషి సునక్, లిజ్ ట్రస్ వెనుక ఉన్నట్లు తేలింది.

తన ప్రభుత్వంలో అనేక కుంభకోణాలు, మంత్రుల రాజీనామాల తర్వాత బోరిస్ జాన్సన్ తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసినట్లు జూలైలో బ్రిటన్ కొత్త ప్రధానమంత్రి పదవికి ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా చేసిన తర్వాత దాదాపు రెండు నెలలుగా జరుగుతున్న కసరత్తు ఈరోజు ముగియడంతో బ్రిటన్‌కు కొత్త ప్రధాని పదవి దక్కింది.

క‌న్జ‌ర్వేటివ్ రేసులో లిజ్ ట్ర‌స్‌కు 81,326 ఓట్లు పోల‌య్యాయి. కొత్త ప్రధాని లిజ్‌ ట్రస్‌‌కు గట్టి పోటీ ఇచ్చిన రిషి సునాక్‌కు 60,399 ఓట్లు వచ్చాయి. మొత్తం ఎల‌క్ట‌రేట్ సంఖ్య 172,437. దీంట్లో 82.6 శాతం మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. 654 బ్యాలెట్ పేప‌ర్ల‌ను తిర‌స్క‌రించారు.

లిజ్‌ ట్రస్‌ ఎవరంటే..

బ్రిటన్‌ కొత్త ప్రధానిగా లిజ్‌ ట్రస్‌ బాధ్యతలు చేపడుతారు. బోరిస్‌ జాన్సన్‌ కేబినెట్‌లో విదేశాంగశాఖ మంత్రిగా పనిచేశారు లిజ్‌ ట్రస్‌ .. ప్రధాని పదవి కోసం లిజ్‌ ట్రస్‌, భారత సంతతికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌ హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే ఈ పోటీలో లిజ్‌ ట్రస్‌ అనూహ్యంగా ఆధిపత్యం సాధించారు. కన్జర్వేటివ్‌ పార్టీకి చెందిన లక్షా 60 వేల మంది క్రియాశీల సభ్యులు.. ఆగస్టు నెల నుంచి పోస్ట్‌ ద్వారా, ఆన్‌లైన్‌లోనూ ఈ నెల 2వ తేదీ వరకు ఓటుహక్కు వినియోగించుకున్నారు. ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తన పదవికి రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైంది.

పార్టీ నేతగా ఎన్నికైన లిజ్‌ ట్రస్‌ స్కాట్లాండ్‌కు వెళ్లి రాణి నుంచి నియామక పత్రం అందుకుంటారు. ఇంగ్లండ్‌కు, బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌కు బదులుగా మరోచోట నుంచి ప్రధాని పేరును రాణి ప్రతిపాదించడం బ్రిటన్‌ చరిత్రలో ఇదే మొదటిసారి.

96 ఏళ్ల రాణి వయస్సు రీత్యా ప్రయాణాలను గణనీయంగా తగ్గించుకున్నారు. ప్రస్తుతం ఆమె అబెర్దీన్‌షైర్‌ బాల్మోరల్‌ కోటలో గడుపుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం కొత్తగా నియమితులైన ప్రధానమంత్రి డౌనింగ్‌ స్ట్రీట్‌ కార్యాలయం నుంచి మొదటి ప్రసంగం చేయడానికి ముందే కీలకమైన కేబినెట్‌ పదవులను ఖరారు చేస్తారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం