స్నేహితుడి చెవి కొరికి నమిలి మింగేసిన యువకుడు! వీడియో
ఈ మధ్య ఎవరు, ఎప్పుడు, ఎలా ప్రవర్తిస్తారో అర్థం కావట్లేదు. అప్పటి వరకూ బాగానే ఉండి ఒక్కసారిగా నరరూప రాక్షసుల్లా మారిపోతున్నారు. అది అర్థం అయ్యేలోపే ఎదుటి వారిపై దాడులకు తెగ బడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. ఓ వ్యక్తి తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటుండగా.. ఉన్నట్టుండి గొడవ పడ్డాడు. ఆపై తీవ్ర కోపోద్రేకానికి గురై ఓ మిత్రుడి చెవిని కొరికేశాడు. కొంచెం భాగం పూర్తిగా తెగి పడగా.. దాన్ని నమిలి మింగేశాడు. దీంతో విపరీతంగా భయపడిపోయిన స్నేహితులు వెంటనే బాధితుడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు.
మహారాష్ట్రలోని థానే జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. హీరానందాని ఎస్టేట్‌లో 37 ఏళ్ల సినీ నిర్మాత శ్రావణ్ లీఖా, 32 ఏళ్ల ఐటీ ప్రొఫెషనల్ వికాస్ మీనన్ కలిసి నివసిస్తున్నారు. వీరిద్దరూ ముందు నుంచే స్నేహితులు కావడంతో కలిసి ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకుని ఉంటున్నారు. అయితే ఫిబ్రవరి 26వ తేదీన తమ స్నేహితులను ఇంటికి పిలిచి పార్టీ చేసుకున్నారు. ఈ క్రమంలోనే వికాస్ మీనన్, శ్రావణ్‌ల మధ్య గొడవ ప్రారంభం అయింది. చిన్న విషయం గురించే వాదులాడుకున్న ఈ ఇద్దరు.. ఎవరూ వెనక్కి తగ్గలేదు. స్నేహితులు వద్దని చెబుతుండగానే.. వికాస్ మీనన్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఒక్కసారిగా లేచి తన పక్కనే కూర్చున్న శ్రావణ్ వద్దకు వచ్చాడు. వెంటనే అతడి చెవిని నోటితో అందుకున్నాడు. ఆపై గట్టిగా కొరికేయగా.. కొతం భాగం తెగి పడింది. దాన్ని అలాగే నోట్లో వేసుకున్న వికాస్ మీనన్.. ఆపై నమిలి మింగేశాడు. ఇలా ఒక్కసారిగా జరిగిన ఈ దారుణ ఘటనలతో స్నేహితులతో పాటు శ్రావణ్ కూడా తీవ్రంగా భయపడిపోయాడు. వెంటనే అంతా అక్కడి నుంచి పరుగులు తీశారు. ముఖ్యంగా ఇంటి బయటకు వచ్చేసిన స్నేహితులు శ్రావణ్‌ను స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు వికాస్ మీనన్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
అవి ఖర్జూర పండ్లా.. బంగారు పండ్లా? వీడియో
అమెరికాలో కోమాలో భారతీయ విద్యార్థిని..తండ్రికి వీసా పై సందిగ్ధత ?వీడియో
ఈ చెప్పులు ఎత్తుకెళ్లాలంటే కష్టమే.. ఎందుకంటే? వీడియో
అంగారక గ్రహంపై పెద్ద సముద్రం.. ఆశ్చర్యపరుస్తున్న తాజా పరిశోధన వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
