Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇయర్ ఫోన్స్ తో యమ డేంజర్.. ఈ ప్రకటన చెప్పిందీ ఇదే!వీడియో

ఇయర్ ఫోన్స్ తో యమ డేంజర్.. ఈ ప్రకటన చెప్పిందీ ఇదే!వీడియో

Samatha J

|

Updated on: Mar 05, 2025 | 2:44 PM

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ ఫోన్‌, చెవిలో ఇయర్ ఫోన్స్‌ కామన్‌ అయిపోయింది. బైక్‌పై వెళ్తున్నా, కారులో వెళ్తున్నా, చివరికి రోడ్డుపై నడిచి వెళ్తున్నా వీటిని వదలడం లేదు. ఉదయం లేచిన దగ్గరనుంచి రాత్రి పడుకునే ముందు వరకూ ఫోన్‌, ఇయర్‌ ఫోన్స్‌ లేనిదే రోజు గడవని పరిస్థితి నెలకొంది. అయితే వీటి వినియోగం కొంతవరకూ మంచిదే.. కానీ అతి ఏదైనా అనర్ధమే అన్నట్టు.. వీటి వినయోగం కూడా మితిమీరితే ప్రమాదం అని తమిళనాడు ప్రజా ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇయర్‌ ఫోన్స్‌ వాడకం వల్ల అనేక పరిష్కరించలేని సమస్యలు తెలెత్తుతుతున్నాయని సూచించారు.

ఇయర్‌ఫోన్, హెడ్‌ఫోన్‌ను ఎక్కువ సమయం వినియోగించడం వల్ల తాత్కాలికంగా వినికిడి సమస్య తలెత్తుతుందని ఆరోగ్యశాఖ డైరెక్టర్ సెల్వవినాయగం తెలిపారు. ఇలా వచ్చే వినికిడి లోపాన్ని సరిచేయలేమని, వినికిడి కోసం ఉపయోగించిఏ మెషిన్‌ కూడా ఆ సమస్యను పరిష్కరించలేదని తెలిపారు. ఇయర్ ఫోన్లు ఎక్కువగా ఉపయోగించవద్దని తమిళనాడు ప్రజారోగ్యశాఖ హెచ్చరికలు జారీచేసింది. సాధారణస్థాయి కంటే ఎక్కువ ధ్వని ఉండే బ్లూటూత్ ఇయర్ ఫోన్లు, హెడ్‌ఫోన్ తదితర వాటిని అనవసరంగా ఉపయోగించకూడదని సెల్వ వినాయగం పేర్కొన్నారు. అవసరం అనుకుంటే 50 డెసిబెల్స్ కంటే తక్కువ వాల్యూమ్ స్థాయిలో ఉపయోగించుకోవాలని సూచించారు. ఇయర్ ఫోన్లను రెండు గంటలకు మించి ఏకధాటిగా ఉపయోగిస్తే ప్రమాదం తప్పదని హెచ్చరించారు. అలాగే, చిన్నారులు ఫోన్, టీవీని చూడటం తగ్గించాలని సూచించారు.

మరిన్ని వీడియోల కోసం :

అవి ఖర్జూర పండ్లా.. బంగారు పండ్లా? వీడియో

అమెరికాలో కోమాలో భారతీయ విద్యార్థిని..తండ్రికి వీసా పై సందిగ్ధత ?వీడియో

ఈ చెప్పులు ఎత్తుకెళ్లాలంటే కష్టమే.. ఎందుకంటే? వీడియో

అంగారక గ్రహంపై పెద్ద సముద్రం.. ఆశ్చర్యపరుస్తున్న తాజా పరిశోధన వీడియో