పూరీ కోసం కొట్టుకున్నారు ..ఇన్వెస్టర్ల సదస్సులో చీప్ ప్రవర్తన వీడియో
భోపాల్‌లో జరుగుతోన్న మధ్యప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో ఊహించని ఘటన జరిగింది. భోజనాల సమయంలో ఇన్వెస్టర్లు మర్యాద మరిచి పూరీ, సబ్జీ కోసం కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు ప్లేట్లు విసురుకుని నానా హంగామా సృష్టించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 30 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులే లక్ష్యంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం.. భోపాల్‌లో గ్లోబల్ ఇన్వెస్టిమెంట్ సదస్సు నిర్వహించింది. ప్రధాని మోదీ సదస్సును ప్రారంభించగా.. 60 దేశాలకు చెందిన ప్రతినిధులు, గౌతమ్ అదానీ సహా దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు.
ఈ సదస్సుకు హాజరైనవారికి భోజనాలు ఏర్పాటు చేయగా. ఒక్కసారిగా అందరూ డైనింగ్ హాల్‌లోకి దూసుకొచ్చారు. క్యూలైన్‌లో ఒకరి నొకరు తోసుకుంటూ.. ప్లేట్లు లాక్కుంటూ గందరగోళం సృష్టించారు. భోజన సమయంలో ఆహారం తీసుకోవడానికి వెళ్తుండగా విరిగిన ప్లేట్లు ఫ్లోర్‌పై చెల్లాచెదురుగా పడిపోయాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల జరిగిందా? హాజరైన వారిలో తీవ్ర నిరాశ వల్ల జరిగిందా? అనే చర్చకు దారితీసింది.వీడియోను చూసిన నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ‘నేను చాలా సమ్మిట్‌లకు హాజరయ్యాను కానీ మధ్యప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో దృశ్యాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.. ప్రతి ఒక్కళ్లూ భోజనం కోసం కొట్టుకుంటున్నారు’ అని ఇంకొకరు పోస్ట్ పెట్టాడు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా పెట్టుబడుల కోసం సదస్సు నిర్వహిస్తే.. వీళ్లంతా ఇంత చీప్‌గా బిహేవ్ చేయడం ఏంటి? అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
అవి ఖర్జూర పండ్లా.. బంగారు పండ్లా? వీడియో
అమెరికాలో కోమాలో భారతీయ విద్యార్థిని..తండ్రికి వీసా పై సందిగ్ధత ?వీడియో
ఈ చెప్పులు ఎత్తుకెళ్లాలంటే కష్టమే.. ఎందుకంటే? వీడియో
అంగారక గ్రహంపై పెద్ద సముద్రం.. ఆశ్చర్యపరుస్తున్న తాజా పరిశోధన వీడియో

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
