AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఛీ.. ఛీ.. ఇదేం పని.. పబ్లిక్‌గా గాజుల చోరీకి యత్నించిన మున్సిపల్ కౌన్సిలర్.. వీడియో వైరల్

కూనూరులో మున్సిపల్ చైర్‌పర్సన్ గాజులను దొంగిలించడానికి ప్రయత్నించిన డీఎంకే కౌన్సిలర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను సోషల్ మీడియా X పేజీలో పోస్ట్ చేసిన తమిళనాడు బీజేపీ నాయకుడు అన్నామలై అధికార పార్టీ డీఎంకేపై నిప్పులు చెరిగారు.

ఛీ.. ఛీ.. ఇదేం పని.. పబ్లిక్‌గా గాజుల చోరీకి యత్నించిన మున్సిపల్ కౌన్సిలర్.. వీడియో వైరల్
Kunuru Municipality
Balaraju Goud
|

Updated on: Mar 05, 2025 | 12:58 PM

Share

కూనూరులో మున్సిపల్ చైర్‌పర్సన్ గాజులను దొంగిలించడానికి ప్రయత్నించిన డీఎంకే కౌన్సిలర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను సోషల్ మీడియా X పేజీలో పోస్ట్ చేసిన తమిళనాడు బీజేపీ నాయకుడు అన్నామలై అధికార పార్టీ డీఎంకేపై నిప్పులు చెరిగారు.

ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పుట్టినరోజు సందర్భంగా, తమిళనాడు అంతటా డీఎంకే సభ్యులు ప్రతిజ్ఞ చేశారు. అదేవిధంగా, ఈ కార్యక్రమం నీలగిరి జిల్లా కూనూర్‌లో కూడా జరిగింది. అన్నా విగ్రహం దగ్గర జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ సుశీల, కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. అయితే ప్రతిజ్ఞ చదువుతున్నప్పుడు, జాకీర్ హుస్సేన్ మున్సిపల్ చైర్‌పర్సన్ సుశీల చేతులకు ఉన్న గాజులను లాక్కోవడానికి ప్రయత్నించాడు. ఇది చూసి, సమీపంలో ఉన్న మరొక నాయకురాలు అతని చేతిని మెల్లగా తీసివేశారు. ఒకటి రెండు సెకన్లలోనే జాకీర్ హుస్సేన్ తన చేతిని సుశీల చేతిపై తిరిగి వేసి గాజులను తొలగించడానికి ప్రయత్నించాడు. సుశీల వెంటనే తన చేతిని కిందకి దించింది. అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో వెంటనే వైరల్ అయింది. ఇది చూసిన వారు డీఎంకే నేతల తీరును విమర్శిస్తున్నారు.

ఈ క్రమంలోనే తమిళనాడు బీజేపీ నాయకుడు అన్నామలై కూడా ఈ వీడియోను తన ‘X’ సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేశారు, “కూనూర్ మున్సిపల్ కౌన్సిల్‌లోని వార్డ్ 25 డిఎంకె కౌన్సిలర్ మిస్టర్ జాకీర్ హుస్సేన్, హిందీ వ్యతిరేకత ముసుగులో గాజులు దొంగిలిస్తున్నారు” అనే క్యాప్షన్‌తో పాటు. “దొంగతనం, డీఎంకేను ఎప్పటికీ వేరు చేయలేము!” అంటూ రాసుకొచ్చారు. ఈ సందర్భంగా అధికార పార్టీ డీఎంకే తీరుపై తీవ్రంగా విమర్శించారు.

వీడియో చూడండి.. 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
చిన్న గొడవతో భార్యను కడతేర్చిన భర్త! చిన్నారుల ముందే ప్రాణం తీసి
చిన్న గొడవతో భార్యను కడతేర్చిన భర్త! చిన్నారుల ముందే ప్రాణం తీసి
అరటి నారతో ఇక్కత్ వస్త్రం.. పోచంపల్లి నేతన్న వినూత్న ప్రయోగం
అరటి నారతో ఇక్కత్ వస్త్రం.. పోచంపల్లి నేతన్న వినూత్న ప్రయోగం
బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్.. సరికొత్త అప్‌డేట్‌..!
బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్.. సరికొత్త అప్‌డేట్‌..!
జబర్దస్త్ జడ్జెస్ రెమ్యునరేషన్స్ ఎంతో తెలుసా? ఒక్కో ఎపిసోడ్ కోసం
జబర్దస్త్ జడ్జెస్ రెమ్యునరేషన్స్ ఎంతో తెలుసా? ఒక్కో ఎపిసోడ్ కోసం
దుర్గమ్మకు నైవేద్యంగా కొబ్బరి లడ్డూ పెడుతున్నారా?
దుర్గమ్మకు నైవేద్యంగా కొబ్బరి లడ్డూ పెడుతున్నారా?
నమ్మినోడే మోసం చేశాడు.. ఎదురుపడితే నేను చేసే పని అదే..
నమ్మినోడే మోసం చేశాడు.. ఎదురుపడితే నేను చేసే పని అదే..
ఇకపై లైసెన్స్ అంత ఈజీ కాదు భయ్యా.. ఈ టెస్ట్ పాస్ అవ్వకపోతే..
ఇకపై లైసెన్స్ అంత ఈజీ కాదు భయ్యా.. ఈ టెస్ట్ పాస్ అవ్వకపోతే..
మొదటి తరం మహానటి కన్నాంబ గురించి మీకు తెలియని విషయాలు..
మొదటి తరం మహానటి కన్నాంబ గురించి మీకు తెలియని విషయాలు..
IPL 2027లో ధోనీ ఆడతాడా..? తొలిసారి స్పందించిన సీఎస్కే సీఈవో
IPL 2027లో ధోనీ ఆడతాడా..? తొలిసారి స్పందించిన సీఎస్కే సీఈవో
మురళీ మోహన్ చెప్పిన మనీ సేవింగ్ ట్రిక్స్..  లైఫ్ చేంజింగ్ టిప్స్.
మురళీ మోహన్ చెప్పిన మనీ సేవింగ్ ట్రిక్స్..  లైఫ్ చేంజింగ్ టిప్స్.