AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఆన్లైన్‌లో 1700 రూపాయలు చీర షాపింగ్ చేద్దాం అనుకుంటే.. లక్ష పాయె…

సైబర్ నేరస్థులకు కాదేదీ అతీతం...ఎక్కడ సందు దొరికితే అక్కడ డబ్బులు కాజేస్తునారు. తాజాగా మహిళలు షాపింగ్ చేసే శారీ ఆన్లైన్ స్టోర్‌లోకి ఎంటరయ్యారు సైబర్ నేరస్తులు...ఆన్లైన్ లో శారీ కొందామని అనుకుంటే కథ అడ్డం తిరిగి లక్షలు పోగొట్టుకుంది ఓ బాధితురాలు. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

Hyderabad:  ఆన్లైన్‌లో 1700 రూపాయలు చీర షాపింగ్ చేద్దాం అనుకుంటే.. లక్ష పాయె...
Saree
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Mar 05, 2025 | 3:01 PM

Share

హైదరాబాద్‌కు చెందిన 52 ఏళ్ల గృహిణి ఇన్‌స్టాగ్రామ్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు “Vastanzo9” అనే పేజీ కనిపించింది. ఇది చీరలకు సంబంధించిన పేజ్… ఆ పేజీని పరిశీలించేటప్పుడు, ఆమెకు రూ. 1,799/- కి చీర కనిపించడంతో.. కొనుక్కుందాం అనుకుంది. వాళ్లు పేమెంట్ పూర్తిగా చేసిన తర్వాత కొంత రిఫండ్ వస్తుందని చెప్పడంతో ఆమె మంచి ఆఫర్ అని భావించింది. దీంతో వాట్సాప్ ద్వారా విక్రేతను (+91 72759 82926) సంప్రదించారు. విక్రేత సూచించిన ప్రకారం, బాధితురాలు వెంటనే Google Pay ద్వారా ఆ మొత్తం పంపారు.

కొద్దిసేపటి తరువాత షిప్పింగ్ ఛార్జీలు అదనంగా మరికొంత నగదు చెల్లించాలని చెప్పాడు.  బాధితురాలు నమ్మి, విక్రేత చెప్పినట్లుగా QR కోడ్ స్కాన్ చేసి, మళ్లీ చెల్లింపు చేసింది. విక్రేత ఆమెకు చెల్లింపు రసీదు పంపాడు, తద్వారా ఆమెను నమ్మేలా చేశాడు.అయితే, ఆ తర్వాత విక్రేత వాట్సాప్ కాల్ ద్వారా బాధితురాలిని సంప్రదించి, ఆమె స్క్రీన్‌ను షేర్ చేయమని అభ్యర్థించాడు. ఇది రిఫండ్ ప్రాసెస్ కోసం అవసరమని చెప్పాడు. బాధితురాలు నమ్మి, స్క్రీన్ షేరింగ్ చేసి, అతను చెప్పిన విధంగా చేసింది. ఈ సమయంలో, విక్రేత Google Pay ద్వారా అనేక చెల్లింపుల అభ్యర్థనలు పంపాడు. బాధితురాలు అజాగ్రత్తగా వాటిని ఆమోదించడంతో, మొత్తం రూ. 1,23,796/- (ఒక లక్ష ఇరవై మూడు వేల ఏడు వందల తొంభై ఆరు రూపాయలు) కోల్పోయారు.

చివరికి, బాధితురాలు మళ్లీ సంప్రదించినప్పుడు, విక్రేత ఫోన్ కాల్స్‌కి స్పందించలేద దీంతో మోసపోయినట్లు పూర్తిగా అర్థమైంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలాంటి నేరస్థులు చాలా మందిని మోసం చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్ పేజీలు ఏర్పాటు చేసి, ఆకర్షణీయమైన ధరలకు ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు నమ్మబలుకుతున్నారు. అలాంటి వారినీ నమ్మకండి అని ప్రజలకు సూచిస్తున్నారు.

మోసగాళ్ల మోసపూరిత విధానం:

బాధితులు ఇన్‌స్టాగ్రామ్‌లో తక్కువ ధరలకే ఉత్పత్తులు అందిస్తున్న నకిలీ పేజీలను చూస్తారు విక్రేతను వాట్సాప్‌లో సంప్రదించిన తర్వాత, Google Pay లేదా UPI ద్వారా చెల్లింపులు చేయమని కోరతారు. మొదటి చెల్లింపును చేసిన తర్వాత, షిప్పింగ్ ఛార్జీలు లేదా రీఫండ్ కోసం మరిన్ని డబ్బులు పంపాలని కోరతారు. బాధితులను స్క్రీన్ షేరింగ్ చేయమని కోరుతూ, అదనపు చెల్లింపులు చేయిస్తారు. చివరగా, బాధితుల నుంచి భారీ మొత్తాన్ని మోసం చేసి, విక్రేత అదృశ్యమవుతారు.

సామాన్య ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

✔ వాస్తవమైన సమీక్షలు పరిశీలించండి – కొనుగోలు చేసే ముందు, సంబంధిత వెబ్‌సైట్ లేదా పేజీ నిజమైనదేనా అనే విషయంలో పూర్తిగా నిర్ధారించుకోండి. ✔ నేరుగా బ్యాంక్ అకౌంట్స్‌కు డబ్బులు పంపవద్దు – అన్ని చెల్లింపులు భద్రత కలిగిన పేమెంట్ గేట్‌వేల ద్వారా చేయండి. ✔ అదనపు చెల్లింపుల అభ్యర్థనలకు జాగ్రత్తపడండి – ఏ నిజమైన విక్రేత అయినా ఒకసారి చెల్లింపు తీసుకున్న తర్వాత, మళ్లీ డబ్బు అడగరు. ✔ మీ స్క్రీన్‌ను ఎవరికీ షేర్ చేయవద్దు – స్క్రీన్ షేరింగ్ ద్వారా, మోసగాళ్లు మీ ఖాతాలో డబ్బును అపహరిస్తారు. ✔ నకిలీ ఇన్‌స్టాగ్రామ్ పేజీలను రిపోర్ట్ చేయండి – Instagram/Facebook మద్దతుకు ఫిర్యాదు చేయండి. ✔ బ్యాంక్, సైబర్ క్రైమ్ శాఖకు వెంటనే సమాచారం ఇవ్వండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..