Hyderabad: అమ్మ నాన్న కష్టపడి చదివిస్తుంటే.. ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్..
బెట్టింగ్ గేమ్స్.. సరదాగా మొదలై.. వ్యసనంగా మారుతున్నాయి. ఈ భూతం బారినపడి ఎంతోమంది బలవుతున్నారు.. బెట్టింగ్ ఉచ్చులో పడి ఏదో ఒక రోజు గెలుస్తామని ఆశపడుతూ అప్పుల ఊబిలో కూరుకున్నారు.. అప్పులు తీర్చలేక బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా.. ఓ విద్యార్థి బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు..

బెట్టింగ్ గేమ్స్.. సరదాగా మొదలై.. వ్యసనంగా మారుతున్నాయి. ఈ భూతం బారినపడి ఎంతోమంది బలవుతున్నారు.. బెట్టింగ్ ఉచ్చులో పడి ఏదో ఒక రోజు గెలుస్తామని ఆశపడుతూ అప్పుల ఊబిలో కూరుకున్నారు.. అప్పులు తీర్చలేక బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా.. ఓ విద్యార్థి బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.. రంగారెడ్డి జిల్లాలో ఆన్‌లైన్ బెట్టింగ్‌లో రూ. లక్ష పోగొట్టుకున్న 20 ఏళ్ల డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కందుకూరు మండలంలోని దేబ్బాడగూడ గ్రామానికి చెందిన విక్రమ్.. హైదరాబాద్‌లోని బిజెఆర్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు.. బెట్టింగ్ కు అలవాటుపడిన విక్రమ్.. తన కుటుంబానికి తెలియకుండా తరచూ డబ్బులను పెడుతుండేవాడు..
“ఫన్ ఇన్ ఎక్స్ఛేంజ్” అనే ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ను ఉపయోగిస్తున్న విక్రమ్.. మంగళవారం ఆ ప్లాట్‌ఫామ్‌లో రూ.1 లక్ష వరకు కోల్పోయాడు. ఈ విషయం విక్రమ్ తండ్రికి తెలిసింది. బుధవారం ఉదయం విక్రమ్ తండ్రి జరిగిన నష్టం గురించి నిలదీశారు.. అంతేకాకుండా ఇలాంటివి చేయొద్దంటూ విక్రమ్‌ను మందలించారు.
ఆ తర్వాత మనస్థాపానికి లోనైన విక్రమ్.. మధ్యాహ్నం తరువాత, వ్యవసాయ పొలంలో పురుగుమందు తాగాడు. కుటుంబ సభ్యులు అతన్ని హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు, అక్కడ చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మరణించాడు.
విక్రమ్ మరణించిన తర్వాత అతని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రి వైద్య సిబ్బంది సిఫార్సు మేరకు అతని తల్లిదండ్రులు అతని కార్నియాలను దానం చేశారని పోలీసులు తెలిపారు.
ఆన్లైన్ బెట్టింగ్ భూతానికి దూరంగా ఉండాలని.. బంగారం లాంటి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దంటూ పోలీసులు సూచిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
