బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో గోల్డ్ లోన్లు ఆదరణ పొందుతున్నాయి. అయితే, బంగారం ధరల అస్థిరత్వం కారణంగా రుణం విలువ నిష్పత్తిని 75% నుండి 62%కి తగ్గించాలని బ్యాంకులు చూస్తున్నాయి. ఆర్బీఐ అధికారిక ప్రకటన రానప్పటికీ, ప్రస్తుతం 60-65% ఇస్తున్న లోన్ శాతం మరింత తగ్గితే రుణగ్రహీతలకు షాక్ తప్పదు.