AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Warangal: గ్రాండ్‌గా ఎమ్మెల్యే బర్త్ డే సెలబ్రెయేషన్స్.. కానుకలతో షాక్ ఇచ్చిన అభిమానులు..!

బహుశా ఎక్కడా కనిపించని విచిత్ర సన్మానం ఇది.. ఏ నియోజకవర్గంలో ఐనా ఎమ్మెల్యే బర్త్‌డే అంటే ఊరంతా ఫ్లెక్సీలు కట్టడం, ఆయన మెప్పుకోసం శాలువాలతో సత్కరించడం.. వేలాది రూపాయలు వెచ్చించి పెద్ద పెద్ద బొకేలు ఇవ్వడం సహజంగా చూస్తుంటాం. కానీ వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు ఇచ్చిన పిలుపు కార్యకర్తలను ఊహించని విధంగా మలుపు తిప్పింది.

Warangal: గ్రాండ్‌గా ఎమ్మెల్యే బర్త్ డే సెలబ్రెయేషన్స్.. కానుకలతో షాక్ ఇచ్చిన అభిమానులు..!
Vardhannapet Mla K.r. Nagaraju
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Mar 05, 2025 | 9:51 AM

Share

సాధారణంగా నాయకులు, ప్రజాప్రతినిధుల జన్మదినం వచ్చిందంటే కార్యకర్తల అభిమానం కట్టలు తెంచుకుంటోంది. చేతిలో బొకేలు, శాలువాలు, ప్లాంట్స్‌తో అభిమానులు వాళ్ల ఇళ్ళ ముందు క్యూ కడుతుంటారు. ఆ నాయకుడి మెప్పుకోసం కొందరైతే వారి పెయింటింగ్ స్కెచ్ వేసి మరి ఫోటోలతో అభిమానాన్ని చాటుకుంటారు. కానీ వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తన బర్త్ డే సందర్భంగా కార్యకర్తలకు ఇచ్చిన పిలుపు మేరకు వాళ్ళు ఏం చేశారో తెలుసా..? ఆ MLA బర్త్‌డేకు ఊహించిన విధంగా కానుకలు ఇచ్చారు.

బహుశా ఎక్కడా కనిపించని విచిత్ర సన్మానం ఇది.. ఏ నియోజకవర్గంలో ఐనా ఎమ్మెల్యే బర్త్‌డే అంటే ఊరంతా ఫ్లెక్సీలు కట్టడం, ఆయన మెప్పుకోసం శాలువాలతో సత్కరించడం.. వేలాది రూపాయలు వెచ్చించి పెద్ద పెద్ద బొకేలు ఇవ్వడం సహజంగా చూస్తుంటాం. కానీ వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు ఇచ్చిన పిలుపు కార్యకర్తలను ఊహించని విధంగా మలుపు తిప్పింది. మార్చి 4వ తేదీన ఆయన బర్త్ డే జరిగింది. ఈ సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు నోట్ బుక్స్ కానుకగా ఇచ్చారు. దీంతో నోట్ బుక్స్ కట్టలు ఆయనే షాక్ అయ్యేలా చేసింది. ఒకటి కాదు రెండుకాదు లక్షకు పైగా నోట్ బుక్స్ పెన్నులు పెన్సిళ్లు స్టడీ మెటీరియల్ అందజేసి ఆ ఎమ్మెల్యే పై వినూత్న రీతిలో అభిమానాన్ని చాటుకున్నారు.

నోట్ బుక్స్, పెన్నులు, ప్యాడ్స్‌తో ఒకటికాదు రెండుకాదు ఆయన ఇంట్లో ఒక గది మొత్తం నిండిపోయింది. గత ఏడాది బర్త్ డే సందర్భంగా పూల దండలు, బొకేలకు బదులుగా నోట్ బుక్స్ గిఫ్టుగా ఇవ్వాలని ఆయన ఇచ్చిన పిలుపు నేపథ్యంలో అభిమానులు ఈ విధంగా అభిమానాన్ని చాటారు. వేలాది రూపాయలు వెచ్చించి పూల బొకేలు తీసుకురావడం వల్ల ఆ పువ్వులు రెండు రోజుల్లో వాడి పోతాయి. కానీ ఒక నోట్ బుక్, పుస్తకం ఇస్తే పేద విద్యార్థి జీవితం నిలుస్తుందని పిలుపునిచ్చారు. ఆ పిలుపుతో కార్యకర్తలు, అభిమానులు ఈ విధంగా పెన్నులు, పెన్సిళ్లు, పుస్తకాలు, ప్యాడ్స్ తో ఆయనపై అభిమానాన్ని చాటుకున్నారు.

వాళ్ల అభిమానాన్ని చూసి ఫిదా అయిన ఎమ్మెల్యే నాగరాజు తనపై అభిమానంతో పెన్నులు పుస్తకాలు నోట్ బుక్స్ అందజేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత తానే స్వయంగా పాఠశాలలకు వెళ్లి పేద విద్యార్థులకు నోట్ బుక్స్, స్టడీ మెటీరియల్స్ అందజేస్తారని తెలియజేశారు.

వీడియో చూడండి.. 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..
ఒక దశాబ్దపు ప్రస్థానం! ఆ సూపర్‌‌హిట్ సినిమాకు పదేళ్లు
ఒక దశాబ్దపు ప్రస్థానం! ఆ సూపర్‌‌హిట్ సినిమాకు పదేళ్లు
మైక్రోవేవ్ ప్రాణాంతకమా? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు!
మైక్రోవేవ్ ప్రాణాంతకమా? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు!
చలితో బరువుతగ్గొచ్చట.. బ్రౌన్ ఫ్యాట్ సీక్రెట్ చెప్పిన సైంటిస్టులు
చలితో బరువుతగ్గొచ్చట.. బ్రౌన్ ఫ్యాట్ సీక్రెట్ చెప్పిన సైంటిస్టులు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన, బంగారం, వెండి ధరలు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన, బంగారం, వెండి ధరలు
అందుకే అవకాశాలు కోల్పోయాను.. హీరోయిన్ తాప్సీ..
అందుకే అవకాశాలు కోల్పోయాను.. హీరోయిన్ తాప్సీ..
ఈ చైల్డ్ ఆర్టిస్ట్‌ను గుర్తుపట్టారా? నెట్టింట ఫొటోలు వైరల్
ఈ చైల్డ్ ఆర్టిస్ట్‌ను గుర్తుపట్టారా? నెట్టింట ఫొటోలు వైరల్
ఖాళీ క్లాస్ రూమ్‌లు.. తుస్సుమన్న గ్యారెంటీలు.. కాంగ్రెస్‌పై..
ఖాళీ క్లాస్ రూమ్‌లు.. తుస్సుమన్న గ్యారెంటీలు.. కాంగ్రెస్‌పై..