బ్లాక్ చికెన్ ఎప్పుడైనా తిన్నారా.? లాభాలు బోలెడు..

Prudvi Battula 

Images: Pinterest

19 December 2025

బ్లాక్ చికెన్.. దీన్ని కడక్‌నాథ్ లేదా కాళీ మాస్ అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశానికి చెందిన అరుదైన కోడి జాతి.

బ్లాక్ చికెన్

ఈ కడక్‌నాథ్ కోడి విలక్షణమైన నల్లటి ఈకలు, చర్మం, మాంసానికి ప్రసిద్ధి చెందింది. ఇది పోషకాలతో నిండి ఉంటుంది.

కడక్‌నాథ్ కోడి

బ్లాక్ కోడి మాంసంలో ప్రోటీన్‌ సమృద్ధిగా ఉంటుంది. ప్రత్యేకమైన పోషక ప్రొఫైల్‌ను కలిగి ఉంటుంది. ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటాయి.

సమృద్ధిగా ప్రోటీన్‌

కొన్ని సాంప్రదాయ వైద్యలలో బ్లాక్ చికెన్ రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో ఎంతగానే సహాయపడుతుందని అంటున్నారు నిపుణులు.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది

బ్లాక్ చికెన్ కండరాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్స్ ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షించడంలో సహాయపడుతుంది.

కండరాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది

ఇతర కోడి జాతులతో పోలిస్తే బ్లాక్ చికెన్ తక్కువ కొవ్వు కలిగి ఉన్నందున బరువు తగ్గాలనుకొనేవారికి మంచి ఎంపికనే చెప్పాలి.

తక్కువ కొవ్వు

బ్లాక్ చికెన్‌లో ఉన్న యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కొన్ని అనారోగ్య పరిస్థితులను తగ్గించడంలో సహాయపడుతుంది.

యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు

ఇది మొత్తం శరీరంలో శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీనిలో ఉన్న ఫ్యాటీ యాసిడ్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

ఫ్యాటీ యాసిడ్స్