Pithapuram: బరిలోకి కోడి పుంజులు.. పందేలపై గుడ్ న్యూస్ చెప్పిన మాజీ ఎమ్మెల్యే వర్మ
ఏపీలో కోడి పందాలు షురూ అవుతున్నాయి. కాకినాడ జిల్లా పిఠాపురంలోనూ పందెం రాయుళ్లు సై అంటున్నారు. న్యూ ఇయర్ వేడుకల వేళ రెండు వారాల ముందే సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు మాజీ ఎమ్మెల్యే వర్మ. కోడి పందాల విషయంలో శుభవార్త చెప్పారు. ఆ పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి...
ఏపీలో సంక్రాంతికి ముందే కోళ్లు కత్తులు దూస్తున్నాయి. పొంగల్‌కి రెండు వారాల ముందే పందెం రాయుళ్లు కాయ్ రాజా కాయ్ అంటున్నారు. బరులు గీసి బస్తీ మే సవాల్ అంటున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోనూ కోడి పందాలు షురూ అయ్యాయ్. నూతన సంవత్సరం సందర్భంగా పెద్దయెత్తున చేరుకున్న అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. 13 రోజులు ముందే పిఠాపురంలో సంక్రాంతి సంబరాలను ప్రారంభించిన ఆయన.. కోడి పందాలకు పచ్చజెండా ఊపారు. కత్తులు కట్టని కోడిపుంజులను దువ్వి మరీ బరిలోకి దింపారు వర్మ. పందెంలో అలసిపోయిన కోడిపుంజుకు నోటితో నీళ్లు కొట్టి పందానికి పంపారు. అభిమానుల కేరింతల మధ్య కొద్దిసేపు కోడి పందాలును వీక్షించారు. ఈ సందర్భంగా.. సంప్రదాయాలను కూటమి ప్రభుత్వం గౌరవిస్తుందన్నారు వర్మ.
పిఠాపురంలో సాంప్రదాయ కోడి పందాలు, ఎడ్ల పందాలు జరుగుతాయని ప్రకటించారు. అయితే.. కోడిపుంజులకు కత్తులు కట్టకుండా, హింసించకుండా జరిగే సాంప్రదాయాలను మాత్రమే ప్రోత్సహిస్తామని చెప్పారు. గ్యాంబ్లింగ్ లాంటి జూదాలను ఆడకూడదని పిలుపునిచ్చారు. గ్యాంబ్లింగ్ ఆడడం చట్ట వ్యతిరేకమని స్పష్టం చేశారు మాజీ ఎమ్మెల్యే వర్మ. ఆ వీడియో దిగువన చూడండి…
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..