గడ్డకట్టిన చెరువులో యువతి నిర్వాకం.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
ప్రస్తుత సోషల్ మీడియా యుగం నడుస్తోంది. పిల్లల నుంచి పెద్దల వరకూ రకరకాల రీల్స్ చేస్తూ నెట్టింట హల్చల్ చేస్తుంటారు. ఎలాగైనా ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో కొందరు చిత్రవిచిత్రమైన విన్యాసాలు చేస్తుంటారు. రీల్స్ పుణ్యమా అని కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. యువకులకేమీ తీసిపోమన్నట్లుగా ఇటీవల యువతులు కూడా రీల్స్ వేటలో పడ్డారు.
ఏవోవే విన్యాసాలు చేస్తూ అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. గడ్డ కట్టే చలిలో ఓ యువతి చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. గడ్డ కట్టే చలిలో ఓ యువతి చేసిన నిర్వాకం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మైనస్ డిగ్రీల వాతావరణం కారణంగా ఓ చెరువుపై నీరంతా గడ్డ కట్టి ఉంటుంది. అందులో ఓ యువతి విచిత్రమైన విన్యాసం చేసేందుకు సిద్ధమవుతుంది. నీళ్లలో ఉన్న ఆమె.. పైన గడ్డ కట్టి ఉన్న మంచును పగలగొట్టుకుని బయటికి వస్తుంది. ఆ నీటిలో నిలబడడమే కష్టం అనుకుంటే.. ఈమె మాత్రం ఏకంగా అందులో మునిగి ఎంజాయ్ చేస్తూ కనిపిస్తుంది. అంతటితో ఆగకుండా గట్టుపై కేక్ ఆకారంలో ఏర్పాటు చేసిన మంచును చేతిలోకి తీసుకుని తినేస్తుంది. ఇలా గడ్డ కట్టే చలిలో ఆమె చాలా సేపు విన్యాసాలు చేస్తూ కెమెరాలకు ఫోజులు ఇస్తుంది. ఈమె విచిత్ర ప్రవర్తన చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చైనాలో మరో అద్భుతం.. మరో భారీ ప్రాజెక్టును ప్రారంభం
ఇదేంది మాస్టారూ ఇలా చేశారు.. పాఠాలు చెప్పాల్సిన స్టూడెంట్‌తో..
రన్‌వేపై విమానం ఉండగానే మరో ఫ్లైట్ టేకాఫ్.. రెప్పపాటులో..
12 రోజుల పాటు ట్రాఫిక్ జామ్ !! మళ్లీ వైరల్ అవుతున్న దృశ్యాలు