చైనాలో మరో అద్భుతం.. మరో భారీ ప్రాజెక్టును ప్రారంభం
చైనా మరో భారీ ప్రాజెక్టును ప్రారంభించింది. శరవేగంగా సోలార్ గ్రేట్‌వాల్‌ను నిర్మించే పనిలో పడింది. సుమారు 400 కిలోమీటర్ల పొడవు.. 5 కిలోమీటర్ల వెడల్పుతో వాల్ నిర్మాణం చేపట్టనున్నారు. ఇక్కడి నుంచి సుమారు 100 గిగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. దీంతో బీజింగ్ విద్యుత్తు అవసరాలను తీర్చనున్నారు.
ఇప్పటివరకు దాదాపు 5.4 గిగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగల సోలార్ ప్యానల్స్‌ను అమర్చినట్లు చైనా వెల్లడించింది. ఇన్నర్ మంగోలియాలోని కబుకీ ఎడారిలో ఈ వాల్ నిర్మాణపనులు వేగంగా జరుగుతున్నాయి. గతంలో నిర్మానుష్య ఎడారి ప్రాంతాన్ని సీ ఆఫ్ డెత్‌గా అభివర్ణించేవారు. తాజాగా దీనిపై నాసా ఎర్త్ అబ్జర్వేటరీ స్పందిస్తూ ‘‘ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో ఏర్పాటుచేసిన సోలార్ ప్యానెళ్ల కారణంగా ఫొటోవాల్టిక్ సముద్రంగా ఈ ప్రాంతం మారిపోయింది’’ అని పేర్కొంది. కబుకీ ఎడారిలో వేడి వాతావరణం, చదునైన భూమి, పారిశ్రామిక ప్రాంతాలు దగ్గరగా ఉండటం వంటి అంశాలు సోలార్ ప్రాజెక్టుకు అనువుగా చేస్తాయి. నాసాకు చెందిన ల్యాండ్ శాట్ 8, 9 ఉపగ్రహాలు ఇక్కడి పరిస్థితిని చిత్రీకరించాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇదేంది మాస్టారూ ఇలా చేశారు.. పాఠాలు చెప్పాల్సిన స్టూడెంట్‌తో..
రన్‌వేపై విమానం ఉండగానే మరో ఫ్లైట్ టేకాఫ్.. రెప్పపాటులో..
12 రోజుల పాటు ట్రాఫిక్ జామ్ !! మళ్లీ వైరల్ అవుతున్న దృశ్యాలు