12 రోజుల పాటు ట్రాఫిక్ జామ్ !! మళ్లీ వైరల్ అవుతున్న దృశ్యాలు
వయ్యారాల వంపులు తిరిగే రహదారులపై జామ్మన్ని సాగిపోయే ప్రయాణం గొప్ప అనుభూతిని ఇస్తుంటుంది. అయితే అదే సమయంలో ట్రాఫిక్ జామ్ అయితే మాత్రం అంతకు మించి చికాకు తెప్పిస్తుంటుంది. ట్రాఫిక్ జామ్ అంటే గుర్తొచ్చింది.. సాధారణంగా ట్రాఫిక్ జామ్ అంటే మహా అయితే రెండు, మూడు గంటలు ఉంటుంది. ఇక వర్షాలు పడినప్పుడు మాత్రం ట్రాఫిక్‌లో చిక్కుకున్నామా సగం దినం పోయినట్లే.
ఎక్కడిక్కడ నీరు నిల్వ ఉండటంతో వాహనాలు కదిలే వీలు ఉండదు. ఇంత దానికే మీరు అంత ఫీలయితే.. రోజుల తరబడి ట్రాఫిక్‌లో గడపాల్సి వస్తే.. ఎలా ఉంటుంది? యస్.. అక్కడ ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ఏకంగా 12 రోజులు సమయం పట్టిందట. అంతవరకూ జనాలు అందరూ రోడ్ల మీదనే పడి గాపులు కాశారట. ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది? అని ఆలోచిస్తున్నారా.. ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ చైనాలో ఏర్పడింది. 2010లో జరిగిన ఈ సంఘటన 14 ఏళ్ల తర్వాత మరోసారి వైరల్ అవుతోంది. చైనా చరిత్రలో జరిగిన ఘటనల్లో ఇది కూడా గుర్తిండిపోయేదే. జనాలు వాహనాల్లోనే తిని తాగి నిద్రించేవారు. 2010 ఆగష్టు 14న ఈ ఘటన చోటుచేసుకుంది. చైనాలోని బీజింగ్‌లో అత్యంత పొడవైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు 100 కిలోమీటర్లకు పైగా వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైరల్ వీడియోలు
Latest Videos