Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదేంది మాస్టారూ ఇలా చేశారు.. పాఠాలు చెప్పాల్సిన స్టూడెంట్‌తో..

ఇదేంది మాస్టారూ ఇలా చేశారు.. పాఠాలు చెప్పాల్సిన స్టూడెంట్‌తో..

Phani CH

|

Updated on: Jan 03, 2025 | 8:04 PM

ఏపీలో పదో తరగతి హాఫ్ ఇయర్లీ పరీక్షా పేపర్‌ యూట్యూబ్‌లో లీకవ్వడం కలకలం రేపింది. సమ్మెటివ్‌-1 పరీక్షల గణిత ప్రశ్నాపత్రాలు సమాధానాలతో సహా ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 16న జరగాల్సిన పరీక్షలను రద్దు చేశారు. ఆ తర్వాత ఆ ఎగ్జామ్‌ను ఈ నెల 20వ తేదీన నిర్వహించారు. సాధారణంగా ఫార్మెటివ్‌, సమ్మెటివ్‌-1 అసెస్‌మెంట్ల పరీక్ష పేపర్లను.. మండల రిసోర్సు సెంటర్లలో సీల్డు కవర్లలో భద్రపరుస్తారు.

పరీక్ష జరిగే రోజు ఆ పేపర్లను ఎంఈవో తీసుకొస్తారు. ఆయా పేపర్ల సీల్‌ను పాఠశాలలోని మిగతా టీచర్ల సమక్షంలోనే తెరవాల్సి ఉంటుంది. కానీ ఇంత పక్కాగా ఉండే భద్రతను చేధించి యూట్యూబ్‌లో పేపర్లు ప్రత్యక్షం కావడం సంచలనంగా మారింది. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారాన్ని ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ లీకేజీ వ్యవహారంపై అధికారులు విజయవాడ పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఇక ఈ కేసులో కీలక నిందితుడైన రామచంద్రపురానికి చెందిన తీపర్తి వీరవెంకట సుబ్బారావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఎగ్జామ్‌కు ముందు రోజు మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్‌ను సుబ్బారావు యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ చేశాడని తెలిపారు. అతడు ఆ మండలంలోని జడ్పీ హైస్కూల్‌లో సోషల్‌ టీచర్‌గా పని చేస్తున్నాడని గుర్తించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రన్‌వేపై విమానం ఉండగానే మరో ఫ్లైట్ టేకాఫ్.. రెప్పపాటులో..

12 రోజుల పాటు ట్రాఫిక్‌ జామ్‌ !! మళ్లీ వైరల్‌ అవుతున్న దృశ్యాలు

మహిళలకు దివ్యఔషధం ఇది.. బీట్‌రూట్ జ్యూస్ రోజూ తాగితే..