Andhra News: సీఎం మాటిస్తే సీన్ ఇలా ఉంటది.. దటీజ్ సీబీఎన్

బాబు మాట ఇచ్చారు. ఇక అధికారులు లేట్ చేస్తారా చెప్పండి.. తర్వాతి రోజే మాట నిలబెట్టుకున్నారు. దీంతో ఆ పేద కుటుంబం ఆనందం అంతా ఇంతా కాదు. పాలనను ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్న చంద్రబాబు స్పీడుకు.. అధికారులు కూడా అంతే జోరుగా కదులుతున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి...

Andhra News: సీఎం మాటిస్తే సీన్ ఇలా ఉంటది.. దటీజ్ సీబీఎన్
Edukondalu Family
Follow us
T Nagaraju

| Edited By: Ram Naramaneni

Updated on: Jan 01, 2025 | 6:59 PM

సీఎం చంద్రబాబు మంగళవారం పల్నాడు జిల్లా యలమందలో పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు. గ్రామానికి చెందిన ఏడుకొండలు ఇంటికి వెళ్లి కాఫీ పెట్టి ఇచ్చి ఆయన ఆర్థిక పరిస్థితిపై ఆరా తీశారు. ఏడుకొండలు సైకిల్ షాపు నడుపుకుంటున్నట్లు చెప్పాడు. ఆపై ఏం కావాలని చంద్రబాబు అడిగ్గా.. సైకిల్, మోటారు వాహానాలకు గాలి పెట్టేందుకు అవసరమైన ఎయిర్ కంప్రెసర్ కావాలని కోరాడు. ఆ తర్వాత ఇంటిని కూడా చంద్రబాబు పరిశీలించారు.

అనంతరం ప్రజా వేదిక సమావేశంలో ఏడు కొండలు ఆర్థిక పరిస్థితిని వివరించిన సీఎం ఏడుకొండలు వృత్తికి ఉపయోగపడే ఎయిర్ కంప్రెసర్ ప్రభుత్వమే కొని ఇస్తుందని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఐదారు లక్షల రూపాయల ఖర్చైనా ఇంటి నిర్మాణం చేయిస్తామన్నారు‌. ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన మొత్తాన్ని ఇస్తూనే పార్టీ నుండి కూడా అందిస్తామని ప్రకటించారు. ఆ తర్వాత తాను ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ కలెక్టర్ అరుణ్ బాబుకు ప్రత్యేకంగా చెప్పారు.

సీఎం సమావేశంలో ప్రకటించడంతో ఆ సమావేశం పూర్తయ్యేలోపే ఐదు లక్షల రూపాయల చెక్ అందించారు. అయితే ఏడుకొండలు సైకిల్ షాపుకు అవసరమైన ఎయిర్ కంప్రెసర్‌రను కలెక్టర్ అరుణ్ బాబు జాప్యం చేయకుండా బుధవారం అందించారు. స్వయంగా కలెక్టర్ అరుణ్ బాబే ఏడుకొండలు ఇంటికి వెళ్లి ఎయిర్ కంప్రెసర్ పరికరాన్ని ఇచ్చారు. అరవై వేల రూపాయల విలువైన కంప్రెసర్ అందివ్వటంతో ఆ కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది. రెండు మూడు నెలల సమయం పడుతుందని అంతా అనుకున్నా సీఎం హామీ ఇచ్చిన వెంటనే రెండు హామీలు అమలు కావడంతో ఆ కుటుంబ సభ్యులు తబ్బిబ్బైపోతున్నారు. సీఎం చంద్రబాబుకు రుణపడి ఉంటామంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

రూ. 700 కోట్ల ల్యాండ్ స్కాంలో ఇరుక్కున్న జబర్దస్త్ రీతూ చౌదరి..
రూ. 700 కోట్ల ల్యాండ్ స్కాంలో ఇరుక్కున్న జబర్దస్త్ రీతూ చౌదరి..
మీరు ఎక్కాల్సిన ట్రైన్.. లేటు కాదు.. గతంలో చూడనంత గ్రేట్!
మీరు ఎక్కాల్సిన ట్రైన్.. లేటు కాదు.. గతంలో చూడనంత గ్రేట్!
ఓరీ దేవుడో ఇదేం వింతకాఫీరా సామీ..!రుచి గురించి వింటే షాక్ తింటారు
ఓరీ దేవుడో ఇదేం వింతకాఫీరా సామీ..!రుచి గురించి వింటే షాక్ తింటారు
ముగిసిన 2వ రోజు.. 6 వికెట్లు కోల్పోయిన భారత్.. ఆధిక్యం ఎంతంటే?
ముగిసిన 2వ రోజు.. 6 వికెట్లు కోల్పోయిన భారత్.. ఆధిక్యం ఎంతంటే?
పాత బట్టలు పడేసే ముందు ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి..
పాత బట్టలు పడేసే ముందు ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి..
న్యూ ఇయర్ ఎంజాయ్‌మెంట్ కోసం అడవిలోకి వెళ్లారు.. వామ్మో.. చివరకు..
న్యూ ఇయర్ ఎంజాయ్‌మెంట్ కోసం అడవిలోకి వెళ్లారు.. వామ్మో.. చివరకు..
ప్రేమలో పడ్డ శ్రీలీల.. త్వరలోనే..
ప్రేమలో పడ్డ శ్రీలీల.. త్వరలోనే..
మరీ లక్షల్లో ఏంటి గురూ..!ఈటోస్ట్ కాస్ట్ తెలిస్తే ఫ్యూజులుఔట్
మరీ లక్షల్లో ఏంటి గురూ..!ఈటోస్ట్ కాస్ట్ తెలిస్తే ఫ్యూజులుఔట్
టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. రెండో భారత ఆటగాడిగా రిషబ్ పంత్..
టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. రెండో భారత ఆటగాడిగా రిషబ్ పంత్..
బ్లాక్ చీతాను ఎప్పుడైనా చూశారా..? వీడియో చూస్తే షాకవ్వాల్సిందే
బ్లాక్ చీతాను ఎప్పుడైనా చూశారా..? వీడియో చూస్తే షాకవ్వాల్సిందే