AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS 5th Test: ముగిసిన 2వ రోజు.. 6 వికెట్లు కోల్పోయిన భారత్.. 145కు చేరిన ఆధిక్యం

India vs Australia, 5th Test Day 2: సిడ్నీలో రెండో ఇన్నింగ్స్‌ ఆడుతోన్న భారత జట్టు 6 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. దీంతో భారత జట్టు ఆధిక్యం 145 పరుగులకు చేరుకుంది. మరోసారి టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాటర్స్ ఘోరంగా విఫలమయ్యారు. రిషబ్ పంత్ మాత్రం తుఫాన్ ఇన్నింగ్స్‌తో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61 పరుగులతో ఆకట్టుకున్నాడు.

IND vs AUS 5th Test: ముగిసిన 2వ రోజు.. 6 వికెట్లు కోల్పోయిన భారత్.. 145కు చేరిన ఆధిక్యం
Rishabh Pant Ind Vs Aus 5th Test
Venkata Chari
|

Updated on: Jan 04, 2025 | 12:59 PM

Share

India vs Australia, 5th Test Day 2: సిడ్నీలో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 5వ టెస్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియాపై 145 పరుగుల ఆధిక్యం సాధించింది. అంతకుముందు ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకు ఆలౌటైంది. 9/1 స్కోరుతో శనివారం రెండో రోజు ఆట ప్రారంభించిన కంగారూ జట్టు 172 పరుగుల వద్ద చివరి 9 వికెట్లు కోల్పోయింది. దీంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 4 పరుగుల ఆధిక్యం లభించింది.

నితీష్ రెడ్డి (4 పరుగులు), విరాట్ కోహ్లీ (6 పరుగులు), యశస్వి జైస్వాల్ (22 పరుగులు), కేఎల్ రాహుల్ (13 పరుగులు), శుభ్‌మన్ గిల్ (13 పరుగులు)లు మరోసారి తీవ్రంగా నిరాశ పరిచారు. అయితే, రిషబ్ పంత్ (61) మాత్రం తన తుఫాన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో బోలాండ్ 4 వికెట్లు, కమిన్స్, వెబ్ స్టర్ తలో వికెట్ పడగొట్టారు.

ఇవి కూడా చదవండి

ఆస్ట్రేలియా జట్టు తరపున తొలి ఇన్నింగ్స్‌లో బ్యూ వెబ్‌స్టర్ అత్యధిక స్కోరు 57 పరుగులు చేశాడు. స్టీవ్ స్మిత్ 33, సామ్ కొన్‌స్టాస్ 23 పరుగులు చేశారు. భారత బౌలర్లలో ప్రముఖ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ చెరో 3 వికెట్లు తీశారు. జస్ప్రీత్ బుమ్రా, నితీష్ కుమార్ 2-2 వికెట్లు తీశారు. శుక్రవారం మ్యాచ్‌లో తొలిరోజు భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకు ఆలౌటైంది. 5 టెస్టుల సిరీస్‌లో ప్రస్తుతం ఆతిథ్య జట్టు 2-1 ఆధిక్యంలో ఉంది.

సిడ్నీ టెస్టుకు ఇరు జట్లు..

భారత్: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.

ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్‌స్టాన్స్, మార్నస్ లాబుస్‌చాగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ కారీ (వికెట్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..