Automobile Tips: ఈ చిన్న టిప్స్ పాటిస్తే మీ బండి మైలేజ్ ఆమాంతం పెరిగే ఛాన్స్.. ఎవ్వరికీ తెలియని విషయాలు ఇవే..
బండి కొని కొన్ని సంవత్సరాలు కాకముందే మైలేజ్ తక్కువగా వస్తుందని చాలామంది బాధపడుతూ ఉంటారు. కానీ మీరు చేసే తప్పులే బండి మైలేజ్‌పై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల మైలేజ్ తగ్గకుండా చేసుకోవచ్చు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇందులో చూద్దాం.

ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబ, ఉద్యోగ, వ్యాపార అవసరాల కోసం బైక్ లేదా కారు అనేది కలిగి ఉండటం తప్పనిసరిగా మారిపోయింది. ఎక్కడికైనా వెంటనే చేరుకోవాలంటే వెహికల్ అనేది అవసరం. ఇక అత్యవసర పరిస్ధితుల్లో ఇవి చాలా ఉపయోగపడతాయి. ప్రస్తుతం మార్కెట్లో అనేక బైక్, కార్లు అందుబాటులో ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వెహికల్స్ లాంచ్ అవుతున్నాయి. అయితే వీటిల్లో తక్కువ ధరతో ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాహనాలకు ఫుల్ డిమాండ్ ఉంది. పెట్రోల్, డీజిల్ ఖర్చులు తగ్గించేందుకు ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాహనాలను ప్రజలు కొనుగోలు చేస్తూ ఉంటారు. కంపెనీలు కూడా మార్కెట్‌ను పెంచుకునేందుకు మైలేజ్ ఎక్కువిచ్చే వాహనాలను తయారుచేస్తున్నాయి. అయితే మంచి మైలేజ్ ఇచ్చే వాహనాన్ని కొనుగోలు చేసినా.. మీరు సరిగ్గా వాడకపోతే మైలేజ్ తగ్గే అవకాశముంది. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మైలేజ్ తగ్గకుండా వాహనాన్ని కాపాడుకోవచ్చు.
స్పీడ్ పెంచకండి
వెహికల్ రన్నింగ్‌లో ఉన్నప్పుడు ఒక్కసారిగా స్పీడ్ పెంచకండి. స్లో స్లోగా పెంచుకుంటూ వెళ్లండి. ఎక్కువ వేగంగా వెళ్లకుండా స్థిరంగా ఒకే స్పీడ్‌లో వెళ్లాలి. అవనసరమైన సమయంలో స్పీడ్ పెంచకూడదు. ఇక టైర్ ప్రెషర్ తక్కువగా ఉండకుండా చూసుకోండి. టైర్ ప్రెషర్ తక్కువగా ఉండటం వల్ల బండి మైలేజ్ తగ్గిపోతుంది. అందుకే ఎప్పటికప్పుడు టైర్ ప్రెషర్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక వెహికల్ ఎయిర్ ఫిల్టర్, స్పార్క్ ప్లగ్ ఎప్పుడూ క్లీన్‌గా ఉండేలా చూసుకోండి. ఎప్పటికప్పుడు సర్వీస్ చేసుకోవడం వల్ల అవి క్లీన్‌గా ఉంటాయి. దీని వల్ల మైలేజ్ తగ్గదు. ఇక సామర్థ్యానికి మించి బండిపై బరువు ఎక్కువ ఉండకూడదు. ఇక క్లచ్ అనేది అవసరం లేని సమయంలో ప్రెస్ చేయకూడదు. క్లచ్ ఎక్కువగా ప్రెస్ చేయడం వల్ల నష్టం జరుగుతుంది.
గేర్లు సరిగ్గా మార్చండి
ఇక గేర్లు సరిగ్గా మార్చకపోవడం వల్ల కూడా మైలేజ్ తగ్గిపోతుంది. అందుకే వాహనం స్పీడ్‌కు తగ్గట్లు గేర్లు చేంజ్ చేస్తూ ఉండాలి. అలాగే బండిని పదే పదే ఆపి మళ్లీ స్టార్ట్ చేయడం వల్ల కూడా మైలేజ్ తగ్గిపోతుంది. ఇక నాణ్యమైన పెట్రోల్, డీజిల్ లేకపోవడం, అస్వవ్యవస్థమైన రోడ్లపై ప్రయాణించడం వల్ల కూడా మైలేజ్ తగ్గుతుంది.




